దటీజ్ బాలయ్య... అభిమాని ఫోన్ నెంబర్ సేవ్ చేసుకొని సర్ప్రైజ్ ఇచ్చిన బాలయ్య?

సినిమా ఇండస్ట్రీలో ఉండే సినీ సెలెబ్రెటీలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వారి నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుని ఉంటారు.

ఇక అభిమానులు కూడా వారి ఫేవరెట్ హీరో హీరోయిన్లను చూడటం కోసం వారితో కలిసి ఫోటోలు దిగడ కోసం ఎంతో ఆరాటపడుతూ ఉంటారు.ఇక చాలామంది అభిమానులు వారికి ఇష్టమైన హీరోల ఫోన్ నెంబర్లను కూడా సంపాదించుకొని ఉంటారు.

ఇలా హీరోలా ఫోన్ నెంబర్లు ఉన్నప్పటికీ కూడా సదరు అభిమాని ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడే హీరోలు చాలా అరుదుగా ఉంటారు.అయితే అభిమాని ఫోన్ నెంబర్ సేవ్ చేసుకొని తిరిగి వారికి ఫోన్ చేసే హీరోలు ఉండటం ఎంతో కష్టం కానీ ఇలాంటి జాబితాలో బాలకృష్ణ(Balakrishna) ముందు వరుసలో ఉంటారని చెప్పాలి.

బాలయ్య అభిమానులపై చేయి చేసుకుంటారని అందరూ విమర్శిస్తారు కానీ ఆయన మనసు చాలా మంచిదని ఎంతోమంది ఇప్పటికే బాలయ్య మంచి మనసుపై ప్రశంసలు కురిపించారు.

Balakrishna Gives Surprise His Fans By Calling Phone, Balakrishna, Phone Call, F
Advertisement
Balakrishna Gives Surprise His Fans By Calling Phone, Balakrishna, Phone Call, F

తాజాగా బాలకృష్ణ తన అభిమానికి ఫోన్ చేసి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు.బాలకృష్ణకు ఇటీవల పద్మభూషణ్ (Padma Bushan) అవార్డు రావడంతో కొంతమంది అభిమానులు బాలయ్య కు ఫోన్ చేయగా కొన్ని కారణాలవల్ల ఆయన లిఫ్ట్ చేయలేకపోయారు తద్వారా తిరిగి బాలకృష్ణ వారికి ఫోన్ చేసి వారితో మాట్లాడటంతో ఒక్కసారిగా అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.డాకు మహారాజ్ సినిమా సక్సెస్ అవ్వడమే కాకుండా ఈయనకు పద్మభూషణ్ అవార్డు రావడంతో అభిమానులు బాలయ్యకు విష్ చేస్తూ జై బాలయ్య జై జై బాలయ్య అంటూ అభిమానాన్ని చాటుకున్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో బాలయ్య ఫ్యాన్స్ తన మంచి మనసుకు ఫిదా అవుతూ దట్ ఇస్ బాలయ్య అంటూ కామెంట్లో చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు