ఆయన 25ఏళ్ల కష్టమే ఎక్స్‌పీరియం పార్క్‌: మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్ నగరంలోని చిలుకూరులోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్‌లో( Prodduthuru Western Centre, Chilukur ) నిర్మితమైన రామడుగు రాందేవ్ రావు ఎక్స్‌పీరియం పార్క్‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవిల చేతుల మీదుగా ప్రారంభించారు.మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం రమేష్( Minister Jupalli Krishna Rao, CM Ramesh ) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

 He Is The 25-year-old Megastar Chiranjeevi Of Experium Park, Ramadugu Ramdev Rao-TeluguStop.com

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.రామడుగు రాందేవ్‌( Ramadugu Ramdev ) గారిపై తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.రాందేవ్‌ తో నా పరిచయం ఇప్పటిది కాదు.2000వ సంవత్సరంలోనే ఈ ఎక్స్‌పీరియం పార్క్‌ గురించి ఆయన నాతో పంచుకున్నారు.2002 నుంచి నా ఇంట్లో ఉన్న అనేక మొక్కలు ఆయనతో తెప్పించుకున్నానని చిరంజీవి తెలిపారు.

Telugu Chilkuru, Hyderabad, Jupallykrishna, Chiranjeevi, Ramaduguramdev-Latest N

50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలాన్ని వాణిజ్య ప్రక్రియల కోసం ఉపయోగించేందుకు అవకాశముండి కూడా రాందేవ్ ప్రకృతి, పర్యావరణం గురించి ఆలోచిస్తూ కొత్త తరహా మొక్కలతో ఈ పార్క్‌ను తీర్చిదిద్దారు.ఇది ఒక కళాకృతిగా చెప్పుకోవచ్చ అని చిరంజీవి ప్రశంసించారు.అంతేకాక, ఈ ఎక్స్‌పీరియం పార్క్‌కి సంబంధించిన అపురూప దృశ్యాలను చూశాక ఆయన.ఇది సినిమాల షూటింగ్‌ కోసం చాలా అనుకూలంగా ఉంటుంది పరిమిషన్ ఇస్తారా అని అడిగితే.మొదటి షూటింగ్ నా సినిమా అయితేనే ఇస్తానని అన్నట్లు తెలిపారు.

రాబోయే వర్షాకాలం తరువాత మరింత గ్రీనరీ వచ్చే సమయంలో ఇక్కడ షూటింగ్‌ చేయడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు.

Telugu Chilkuru, Hyderabad, Jupallykrishna, Chiranjeevi, Ramaduguramdev-Latest N

ఈ ఎక్స్‌పీరియం పార్క్‌లో దేశవిదేశాల నుంచి అరుదైన మొక్కల సమాహారం కనిపిస్తుంది.పర్యావరణానికి మేలు చేకూర్చే విధంగా రూపొందించిన ఈ పార్క్ వివిధ కార్యక్రమాలకు, వెడ్డింగ్‌, రిసెప్షన్‌ వంటి ఈవెంట్స్‌ నిర్వహణకు ప్రత్యేకంగా సరిపోతుంది.ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవడం పట్ల చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు.

బిజీగా ఉండి కూడా ఇలాంటి ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు సీఎం రావడం గొప్ప విషయమని అని అన్నారు.ఇకపోతే రామడుగు రాందేవ్ రావు ఎక్స్‌పీరియం పార్క్ పర్యావరణాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలుస్తోంది.

ఈ పార్క్ పర్యావరణ ప్రాముఖ్యతను గమనించి, పర్యాటక రంగంలో అది కొత్త ఒరవడికి నాంది పలుకుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube