ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లు కొట్టివేత

ఫోన్ ట్యాపింగ్ కేసులో( Phone Tapping Case ) నిందితుల బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.

ఈ మేరకు నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు( Nampally Court ) పోలీసుల వాదనలతో ఏకీభవించింది.

ఈ క్రమంలో కేసులో నిందితులుగా ఉన్న ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న మరియు రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది.మరోవైపు ఈ కేసుపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

కేసులో ప్రధాన సూత్రధారిని విచారించేందుకు పోలీసులు లుక్ ఔట్ నోటీసులు( Look Out Notice ) జారీ చేశారు.ఈ క్రమంలోనే రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయలేదని చెప్పిన పోలీసులు రాజకీయ నేతల ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు : రెండు పార్టీల్లోనూ గెలుపు ధీమా 
Advertisement

తాజా వార్తలు