Sai Rajesh Baby Director : వీడు డైరెక్టర్ ఏంటని అన్నారు.. బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ కు అలాంటి అవమానాలు?

ఆనంద్ దేవరకొండ,విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం బేబీ.ఈ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహించారు.

సాయి రాజేష్ ని బేబీ డైరెక్టర్ అని కూడా పిలుస్తూ ఉంటారు.ఇది ఇలా ఉంటే ఇప్పటికే బేబీ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది.

త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్.

ఈ ఈవెంట్ లో భాగంగానే దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ తనకు ఎదురైన ఒక చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చాడు.తమిళనాడు సేలంలో జరిగిన సంఘటనకు సంబంధించిన భయంకరమైన ఫోటోలను చూశాను అది ఒక లవ్ స్టోరీ.

Advertisement

అందులో అమ్మాయి కోణం ఏమిటి అని ఆలోచించాను.కానీ అంత వైలెంట్ గా సినిమాను తీయలేము అనిపించింది దాంతో కొంత ఫన్ యాడ్ చేసుకుంటూ వచ్చాను.

అయితే ముందు నేను ఎస్ కేఎన్ కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేద్దామని అనుకున్నాము.కానీ ఈ సినిమా కథ రాసే కొద్ది నాకు కథ బాగా నచ్చి నేనే డైరెక్ట్ చేయాలనిపించింది.

అయితే అప్పటికి కలర్ ఫోటో సినిమా ఇంకా రిలీజ్ కాలేదు.ఈ సినిమా కథను పట్టుకొని చాలా ప్రదేశాలకు తిరిగినప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది.

అదేమిటంటే నన్ను ఎవరూ డైరెక్టర్ గా కూడా చూడటం లేదని అనిపించింది.అంతేకాకుండా హీరోలు కథ వినడానికి కూడా ఇష్టపడని వీడు డైరెక్టర్ ఏంటనే తరహా రిజెక్షన్స్ ఫేస్ చేశాను అని చెప్పుకొచ్చాడు సాయి రాజేష్.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

ఎప్పుడైనా ఆడియో ఈవెంట్ కి వెళితే ఒక్కొక్క దర్శకుడుని పిలిచినప్పుడు ఆయన చేసిన సినిమా గురించి చెబుతూ ఉండేవారు కానీ నన్ను పిలిచినప్పుడు నా సినిమా హృదయ కాలేయం గురించి పేరు చెప్పడానికే మొహమాట పడిపోయేవారు అది నన్ను నా ఫ్యామిలీని ఎంతగానో బాధ పెట్టింది అని చెప్పుకొచ్చారు సాయి రాజేష్. కలర్ ఫోటో సినిమా రిలీజ్ అయింది ఆ సినిమాకు నేను స్టోరీ రైటర్ ని అయ్యాను నాకు ప్రొడ్యూసర్ గానీ నేషనల్ అవార్డు వచ్చింది.నా ఫ్రెండే నాకు ప్రొడ్యూసర్ కావడం చాలా సంతోషంగా భావిస్తున్నాను అని తెలిపారు సాయి రాజేష్.

Advertisement

ఈవెంట్ లో భాగంగా దర్శకుడు సాయి రాజేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజా వార్తలు