ప్రజలను డైవర్ట్ చేయడానికే బాబు తిట్ల పురాణం..: సజ్జల

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు.ప్రజలను డైవర్ట్ చేయడానికే చంద్రబాబు తిట్ల పురాణం మొదలుపెట్టారన్నారు.

అమరావతిలోనే రాజధాని ఎందుకు ఉండాలనేది దానిపై బాబు సమాధానం చెప్పాలని అడిగారు.న్యాయ రాజధానిపై మీ వైఖరేంటని అడిగితే సమాధానం చెప్పలేదని తెలిపారు.

ప్రజలు అడిగితే సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా అని ప్రశ్నించారు.కర్నూలు జిల్లాలో చంద్రబాబు విన్యాసాలను ప్రజలు చూశారని తెలిపారు.40 ఏళ్ల ఇండస్ట్రీకి అంత కోపం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.పవన్ కల్యాణ్ లా బాబుకు కూడా చెప్పు చూపించాలనే కోరిక ఉన్నట్లుందని ఎద్దేవా చేశారు.

2024లో టాలీవుడ్ ను ముంచేసిన డిజాస్టర్లు ఇవే.. ఈ హీరోల కెరీర్ కు కష్టమేనా?
Advertisement

తాజా వార్తలు