హైడ్రో ఫోనిక్స్ పై అవగాహన బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లా నాబార్డ్( NABARD ) వారి ఆర్థిక సాయంతో ప్రారంభించిన ప్రాజెక్టు “హైడ్రోపొనిక్స్ - ఏ నోవల్ అప్రోచ్ ఫర్ న్యూట్రీషియన్ సెక్యూరిటీ”( Hydroponics ) లో భాగంగా కొదురుపాక గ్రామంలో హైడ్రోపోనిక్స్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ప్రోగ్రాం కో ఆర్డినేటర్ కె.

భవ్య శ్రీ, డా.ఆర్.సతీష్ రైతులకు హైడ్రోపొనిక్స్ సాగు విధానాన్ని విపులంగా వివరించారు.రైతులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇలాంటి నూతన సాగు విధానాలను తెలియజేసినందుకు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సుమారు 30 మంది పాల్గొన్నారు.త్వరలో హైడ్రోపోనిక్స్ యూనిట్ ను వారి గ్రామంలో ఏర్పాటు చేస్తున్నందుకు రైతులందరూ ఆనందంగా ఆహ్వానించారు.

ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని కోరారు.

Advertisement
చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?

Latest Rajanna Sircilla News