అంగన్వాడి టీచర్లకు ప్రాథమిక విద్య పై అవగాహన కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ ఆద్వర్యం లో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిరిసిల్ల పరిధిలోని తంగళ్ళపల్లి మండలంలోని అన్ని అంగన్వాడి టీచర్ లకు ప్రాథమిక విద్య కార్యక్రమాలపై జిల్లా సంక్షేమ అధికారి అవగాహన కల్పించడం జరిగింది .

ఇందులో భాగం గా జిల్లా సంక్షేమ అధికారి పి.

లక్ష్మి రాజం, మాట్లాడుతూ ప్రతి అంగన్వాడి కేంద్రంలో లబ్దిదారులందరికి సరియైన పరిమాణంలో, నాణ్యతతో కూడిన భోజనం స్పాట్ ఫీడింగ్ ఇచ్చేలాగా చూడగలరని తెలపడం జరిగింది.అంగన్వాడి టీచర్ల రోజు వారి పదజాలం, ఉచ్చారణ లో, ప్రీస్కూల్ కరిక్యులం లోని సంభాషణ అంశాలు, ఆంగ్ల భాష మంచి అలవాట్లు బోధించడంలో అంగన్వాడి టీచర్లు కీలకంగా వ్యవహరించాలని చెప్పడం జరిగింది.

అలాగే పిల్లలు ప్రీ స్కూల్ నుండి ప్రాథమిక పాఠశాలకు మారడం సులభం అవుతుంది తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో సి.డి.పి.ఓ, ఆనంధిని , సూపర్ వైజర్ సుష్మిత , జిల్లా పోషణ అభియాన్ కో ఆర్డినేటర్ బాలకిషన్ , జిల్లా మహిళా సాధికారత కో ఆర్డినేటర్ రోజా , చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు
Advertisement

Latest Rajanna Sircilla News