తరచూ అలసటకు గురవుతున్నారా.. అయితే వీటికి మీరు దూరంగా ఉండాల్సిందే!

సాధారణంగా కొందరు రోజు మొత్తం ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు.ప్రతి పనిలో ఎంతో చురుగ్గా పాల్గొంటారు.

కానీ కొందరు మాత్రం తరచూ అలసటకు గురవుతుంటారు.కొంచెం పని చేసిన కూడా నీరస పడిపోతుంటారు.

దీంతో ఏకాగ్రత దెబ్బతింటుంది.ఎప్పుడు మూడీగా ఉంటారు.

మీరు ఈ లిస్టులో ఉన్నారా.అయితే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే ఆహారాలకు మీరు దూరంగా ఉండాల్సిందే.

Advertisement
Avoiding These Foods Will Prevent Fatigue!, Fatigue, Latest News, Energy Levels,

మ‌రి లేటెందుకు ఆ ఆహారాలు ఏంటి.? వాటికి ఎందుకు అవైడ్ చేయాలి.? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ఈ జాబితాలో చక్కెరతో కూడిన స్నాక్స్ మరియు పానీయాల గురించి మొద‌ట చెప్పుకోవాలి.

వీటిని తీసుకోవడం వల్ల అవి మీ శక్తిని హరిస్తాయి.

Avoiding These Foods Will Prevent Fatigue, Fatigue, Latest News, Energy Levels,

నీరసం( Fatigue ), అలసటకు గురిచేస్తాయి.రక్తంలోని చక్కెర స్థాయిల‌ను కంట్రోల్ తప్పేలా చేస్తాయి.అందుకే చక్కెర తో కూడిన స్నాక్స్ మరియు పానీయాలకు దూరంగా ఉండండి.

వాటికి బదులు తాజా పండ్లు, తృణధాన్యాలు తీసుకోండి.అలాగే వేయించిన ఆహారాలు డైట్ లో లేకుండా చూసుకోండి.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

ఇవి అరగాలంటే ఎక్కువ జీర్ణశక్తి అవసరమవుతుంది.పైగా వేయించిన ఆహారాలు కొలెస్ట్రాల్( Cholestrol ) ను పెంచి గుండెకు ముప్పును రెట్టింపు చేస్తాయి.

Advertisement

అందుకే వేయించిన ఆహారాలను అవైడ్ చేయండి.వాటికి బదులుగా కాల్చిన మరియు ఉడికించిన ఆహారాలు తీసుకోండి.

కెఫిన్( Caffeine ) తాత్కాలిక శక్తిని పెంచినప్పటికీ.అధిక వినియోగం వల్ల నిద్రలేమికి దారితీస్తుంది.

కంటినిండా నిద్ర లేకపోతే తరచూ నీరసం, అలసట వంటి సమస్యలు తలెత్తుతాయి.అందుకే కెఫిన్ ఓవర్ లోడ్ ఫుడ్స్ కు దూరంగా ఉండండి.

ఇక ఆల్కహాల్ మీ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది.మరియు మీ కాలేయ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది.ఇది శక్తి తగ్గడానికి దారితీస్తుంది.

అందుకే ఆల్కహాల్ అలవాటును వదులుకోండి.ప్రాసెస్ చేసిన ఆహారాలను కూడా ద్వారం పెట్టండి.

వీటికి బదులుగా నట్స్( Nuts ), మొలకెత్తిన విత్తనాలు, గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు వంటి వాటిని తీసుకోండి.ఇవి మీ ఆరోగ్యానికి పెంచుతాయి.

నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకుంటాయి.

తాజా వార్తలు