హెయిర్ డ్రైయర్ వినియోగించిన మహిళకు హోటల్ షాక్.. ఎంత బిల్లు వేసిందంటే..

ఒక్కోసారి చెయ్యని తప్పులకి కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.చిన్న పొరపాటు పెద్ద భాధకు కూడా దారితీస్తుంది.

అలాంటి అనుభవం కెల్లీ( Kelly ) అనే మహిళకు ఎదురయ్యింది.ఈమె ఇటీవల ఆస్ట్రేలియాలోని( Australia ) పెర్త్ సిటీలో ఒక మ్యూజిక్ కన్సర్ట్ కు హాజరయ్యేందుకు నోవాటెల్ హోటల్‌లో( Novotel Hotel ) దిగింది.

ఆ సమయంలో ఆమె హోటల్ గదిలో హెయిర్ డ్రైయర్‌ని ఉపయోగించింది.అయితే హెయిర్ డ్రైయర్ పొరపాటున ఫైర్ అలారం మోగించింది.

అగ్నిమాపక సిబ్బంది వచ్చి పరిస్థితిని పరిశీలించగా అది తప్పుడు హెచ్చరిక అని తేలింది.దాంతో ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వారు వెళ్లిపోయారు.

Advertisement

కెల్లీ అంతా బాగానే ఉందని భావించి కచేరీకి వెళ్లింది.ఆమె మరుసటి రోజు చెక్ ఔట్ చేసి హోటల్ నుంచి బయలుదేరింది.అయితే మూడు రోజుల తర్వాత, నోవాటెల్ హోటల్ ఆమె బ్యాంక్ ఖాతా నుంచి 1400 డాలర్లు (రూ.1 లక్షా 16 వేలు) వసూలు చేసింది.అంత మొత్తంలో మనీ కట్ కావడంతో ఆమె ఒక్కసారిగా గుండె పగిలింది.

తర్వాత చాలా కోపంతో ఇంత మొత్తం ఎందుకు వసూలు చేశారంటూ హోటల్‌కి ఫోన్ చేసింది.అగ్నిమాపక శాఖ( Fire Department ) కాల్ చేసినందుకు ఫీజు అని వారు ఆమెకు చెప్పారు.

తమ నిబంధనలు, షరతుల ప్రకారం ఏదైనా తప్పుడు అలారం మోగిస్తే అతిథుల నుంచి మనీ వసూలు చేయవచ్చని వారు వివరించారు.

వారి సమాధానంతో కెల్లీకి మరింత కోపం తెప్పించింది.ఛార్జ్ గురించి వారు తనకు ఎలాంటి ఈ-మెయిల్ లేదా హెచ్చరిక పంపలేదని ఆమె చెప్పింది.తాను ఉద్దేశపూర్వకంగా చేయని పనికి తన మంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయడం అన్యాయమని కూడా ఆమె ఫైర్ అయ్యింది.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
వైరల్ వీడియో : సినిమా స్టైల్లో మహిళను రక్షించిన జాలర్లు..

మేనేజర్‌తో మాట్లాడాలని ఆమె కోరగా వారు నిరాకరించారు.హోటల్ అసహ్యంగా, పిరికిదిగా ఉందని ఆమె మీడియా ముందు ఆగ్రహం వెళ్ళగక్కింది.

Advertisement

మీడియా సిబ్బంది హోటల్‌ను సంప్రదించిన తర్వాత, మేనేజర్ చివరకు కెల్లీతో మాట్లాడాడు.అతను క్షమాపణలు చెప్పి ఆమె ఖాతాకు $1400 తిరిగి చెల్లిస్తానని చెప్పాడు.ఇది పొరపాటు అని, ఆమెపై ఛార్జీ విధించే ముందు వారు ఆమెకు తెలియజేయాలని ఆయన అన్నారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తమ పాలసీ, విధివిధానాలను సమీక్షిస్తామని చెప్పారు.మొత్తం మీద ఈ ఘటన అందర్నీ షాక్‌కి గురి చేసింది.

తాజా వార్తలు