ఎన్ఆర్ఐ ఇంటిపై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు.. ఉలిక్కిపడ్డ పంజాబ్

ఆస్ట్రేలియాకు చెందిన పంజాబీ ఎన్ఆర్ఐ సుఖ్‌చరణ్ సింగ్ బాల్ నివాసం వెలుపల గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరులు ముగ్గురు కాల్పులకు దిగడం కలకలం రేపుతోంది.

జైంతీపూర్ గ్రామంలోని సుఖ్‌చరణ్ ( Sukhcharan Singh Bal )ఇంటి బయట మంగళవారం ఈ ఘటన జరిగింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఎనిమిది ఖాళీ బుల్లెట్ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై ఇక్కడి కథునంగల్ పోలీస్ స్టేషన్‌లో బాల్ ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయడంతో పాటు ఆస్ట్రేలియా పోలీసులకు కూడా సమాచారం అందించాడు.

Australia-based Nri Gets Extortion Threats From Lawrence Bishnoi Gang Members ,

బుధవారం తాను సిడ్నీ (ఆస్ట్రేలియా)లో ఉన్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సుఖ్‌చరణ్ పేర్కొన్నాడు. అమృత్‌సర్ ( Amritsar )జిల్లాలోని జైంతీపూర్ గ్రామంలో తన ఇల్లు ఉందని బాల్ తెలిపారు.గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుల నుంచి తన వాట్సాప్ నెంబర్‌కు ఫోన్ వచ్చిందని, అతను తన నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని పేర్కొన్నారు.

కాల్ వచ్చిన వెంటనే ఆస్ట్రేలియా పోలీసులకు ఫిర్యాదు చేశానని , ఇది జరిగిన గంటల్లోనే జైంతీపూర్ గ్రామంలోని తన నివాసం వెలుపల కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని బాల్ వెల్లడించారు.

Australia-based Nri Gets Extortion Threats From Lawrence Bishnoi Gang Members ,
Advertisement
Australia-based NRI Gets Extortion Threats From Lawrence Bishnoi Gang Members ,

తనకు, దుండగులకు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి వాయిస్ మెయిల్‌ను, జైంతీపూర్ గ్రామంలోని తన నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులకు అందజేస్తానని బాల్ అధికారులకు తెలియజేశారు.ఈ ఘటనపై పోలీస్ అధికారులు మీడియాతో మాట్లాడుతూ.జైంతీపూర్ గ్రామంలో పోలీస్ పెట్రోలింగ్ పార్టీ కూడా కాల్పుల శబ్ధాలు విన్నదని చెప్పారు.

దీంతో పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారని.అయితే పోలీసులను చూసిన నిందితులు బైక్‌పై అక్కడి నుంచి పారిపోయారని వెల్లడించారు.

కాగా.పంజాబ్‌( Punjab )లోని ఫాల్కా జిల్లాకు చెందిన లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.

కానీ ఇతని గ్యాంగ్ సభ్యులు మాత్రం బలవంతపు వసూళ్లు, మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.అక్రమ మార్గాల్లో సంపాదించిన సొమ్మును కెనడా తదితర దేశాలకు తరలిస్తున్నారు.2014లో రాజస్థాన్ పోలీసులకు దొరికిన లారెన్స్ బిష్ణోయ్ నాటి నుంచి జైల్లోనే ఉన్నాడు.ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు, మాదక ద్రవ్యాలను రవాణా చేసే సిండికేట్లకు బిష్ణోయ్ నాయకత్వం వహిస్తున్నాడు.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు