హైదరాబాదులో దారుణం..మైనర్ బాలికపై తండ్రి,కొడుకులు అత్యాచారం..!

ఇటీవలే కాలంలో ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కచ్చితంగా వారిని జాగ్రత్తగా కుటుంబ సభ్యులు చూసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

పిల్లల్ని ఆడుకోవడం కోసం పక్కింటికి పంపిస్తే వయస్సుతో సంబంధం లేకుండా అత్యాచారాలకు పాల్పడే కామాంధులు సమాజంలో మన చుట్టూరా ఉన్నారు.

అభం శుభం తెలియని చిన్నారులకు చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తామని ఆశ చూపించి తమ కామ కోరికలు తీర్చుకుంటున్నారు.తాజాగా హైదరాబాదు( Hyderabad )లో ఏడేళ్ల బాలికపై తండ్రి,కొడుకులు అత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ పరిధిలో ఉండే కొంపల్లి లో కర్ణాటక( Karnataka )కు చెందిన శివకుమార్ కుటుంబం వచ్చి అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది.శివకుమార్ కు దివ్యాంగురాలైన భార్య, ఓ కుమారుడు ఉన్నారు.

Advertisement

ఈ తండ్రి, కొడుకులు హైదరాబాదులో ఉండే ఒక కంపెనీలో పని చేస్తున్నారు.వీరు నివాసం ఉంటున్న ఇంటి వెనకాల ఓ ఏడేళ్ల చిన్నారి కుటుంబం ఉంది.

చిన్నారి అప్పుడప్పుడు శివకుమార్ ఇంటికి వెళ్లి ఆడుకునేది, శివ కుమార్ ను తాత అని పిలిచేది.

అయితే ఆ చిన్నారి కుటుంబం ఆగస్టు 10న బహదూర్ పల్లి లో కూలీ పనికి వెళ్ళింది.ఇదే మంచి సమయం అని భావించిన శివకుమార్ ఆ చిన్నారికి సమోసాలు ఇస్తానని ఆశ చూపించి ఇంట్లోకి పిలిచి అత్యాచారం చేశాడు.అనంతరం శివకుమార్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

కాసేపటికి శివకుమార్ కొడుకు వచ్చి ఆ బాలికపై అత్యాచారం చేశాడు.ఆ బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళింది.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఓరి దేవుడా.. ఒక్క చేప ఖరీదు 11 కోట్లా?

తీవ్ర రక్తస్రావం కావడంతో ఇల్లంతా రక్తపు మరకలు పడ్డాయి.కూలీ పనులకు వెళ్లి వచ్చిన తల్లిదండ్రులు ఆ రక్తం మరకలను చూసి చాలా ఆందోళన చెందారు.

Advertisement

ఆలస్యం చేయకుండా ఆ బాలికను వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లగా.వైద్యుడు కేసు పెట్టమని చెప్పడంతో ఆ బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లారు.

పోలీసులు( Police ) ఆ బాలికను వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, ఆ తండ్రి కొడుకుల పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

తాజా వార్తలు