Aswini : పునీత్ లేని లోటును ప్రతిరోజు అనుభవిస్తుంది ..అందుకే అశ్విని ఏం త్యాగం చేసిందో తెలుసా ?

పునీత్ రాజ్ కుమార్..

( Puneeth Raj Kumar ) కన్నడ నాట సూపర్ స్టార్ హీరోగా కొనసాగుతున్న పునీత్ అలనాటి స్టార్ హీరో శివరాజ్ కుమార్( Shivarajkumar ) యొక్క చిన్న కుమారుడు.చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన పునీత్ హీరోగా ఎదిగి స్టార్ హీరోగా ఎన్నో మంచి సినిమాలను తీశాడు.

పునీత్ రాజ్ కుమార్ కేవలం హీరో మాత్రమే కాదు ఎంతో సేవ చేసిన వ్యక్తిగా కూడా అందరికీ పరిచయం.అతను చేసిన సేవా కార్యక్రమాలు ఇలాంటివి అంటే ఏ రోజు పునీత్ స్వయంగా చెప్పుకోలేదు కానీ అతను చనిపోయిన తర్వాత లక్షల మంది బయటకు వచ్చి తాము ఎలా పునీత్ వల్ల లబ్ది పొందామో చెప్తే తప్ప తెలియలేదు.

అంతా పెద్ద ఎత్తున గొప్ప దానాలు చేసినా కూడా ఎవరికీ తెలియ లేదు అంటే అతని గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.అయితే పునీత్ చనిపోయిన తర్వాత కూడా సహాయం కావలసిన వారికి అలాగే ఇలాంటి లోటు లేకుండా చూస్తుంది ఆయన భార్య అశ్విని.

Advertisement

పునీత్ కి భార్య అశ్విని( Aswini ) ఇద్దరు పిల్లలు ఉన్నారు పునీత్ మరణానంతరం అశ్విని ఆయన అభిమానులను ఎల్లప్పుడూ ఒక గంట కనిపెడుతూనే ఉన్నారు.ఎవరికి ఎలాంటి ఆపద ఉన్న తాను అన్నాను అంటూ ముందుకు వస్తున్నారు.అభిమానంతో ఎవరు పిలిచినా వారి దగ్గరికి అశ్విని వెళ్తున్నారు.

స్టార్ స్టేటస్ ఉన్నప్పుడు కూడా అశ్విని ఎప్పుడూ లో ప్రొఫైల్ మెయింటైన్ చేసింది ఇప్పుడు ఇంకా మరింతగా బయట ప్రపంచానికి సంబంధం లేకుండా బ్రతుకుతుంది ముఖ్యంగా పునీత్ చనిపోయిన తర్వాత ఆమె వేషధారణ కూడా అభిమానులను కన్నీరు పెట్టిస్తుంది.మన హిందూ సాంప్రదాయం( Hindu tradition ) ప్రకారం భర్త చనిపోతే భార్య ఎవరు బొట్టు గాజులు, పువ్వులు ధరించరు కానీ ఇప్పటి స్త్రీలు మాత్రం అలాంటివి పట్టించుకోవడం లేదు.

కానీ అశ్విని ఈ విషయంలో నిక్కచ్చిగా ఉంటుంది ఆమె ఒంటి మీద గ్రాము బంగారం కూడా వేసుకోవడానికి ఇష్టపడటం లేదు.పునీత్ తో పాటే అన్ని త్యాగం చేసి పూర్తిస్థాయి హిందూ స్త్రీగా ఆమె తన భర్తకు చేయవలసిన కార్యక్రమాలను చేస్తూనే ఒక సన్యాసిని( nun )గా జీవిస్తూ ఉండడం గమనించాల్సిన విషయం.నుదిటిన బొట్టు కాని చేతులకు గాజులు కానీ ఎలాంటి ఆవరణం కూడా ఒంటిపై లేకుండా కేవలం కాటన్ బట్టలు ధరిస్తూ చాలా సామాన్య స్త్రీ లాగానే ఆమె ఉండటం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021
Advertisement

తాజా వార్తలు