తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై18, గురువారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.52

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.54

రాహుకాలం: మ.1.30 మ3.00

అమృత ఘడియలు: ఉ.9.15 ల9.40

Advertisement

దుర్ముహూర్తం: ఉ.10.00 ల10.48 మ2.48 ల3.36

మేషం:

ఈరోజు తల్లి తండ్రుల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.

బంధువులతో వివాదాలు కలుగుతాయి.ఉద్యోమున అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించక నిరాశ పెరుగుతుంది.

Advertisement

వృషభం:

ఈరోజు వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.దూర ప్రయాణాలు సూచనలున్నవి.

కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో కొంత చికాకు తప్పదు.ఇంటా బయట అప్రమత్తంగా వ్యవహరించాలి.

ఉద్యోగమున అదనపు బాధ్యతలుంటాయి.

మిథునం:

ఈరోజు సోదరులతో ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు.వాహన వ్యాపారస్తులు నూతన లాభాలు అందుకుంటారు.అవసరానికి సన్నిహితులు సహాయం అందుతుంది.

కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది.వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.

కర్కాటకం:

ఈరోజు స్ధిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలసి వస్తాయి.నూతన వ్యాపారాలు ప్రారంభించిన ఆశించిన లాభాలు అందుకుంటారు.జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు.ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి

సింహం:

ఈరోజు దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.దీర్ఘ కాలిక ఆరోగ్యసమస్యలు భాదిస్తాయి.బంధు మిత్రులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి.

వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.దైవ చింతన పెరుగుతుంది.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఖర్చు పెరుగుతుంది.వ్యాపార విషయంలో లాభాలు అందుతాయి.

ఒక మంచి శుభవార్త వింటారు.దీనివల్ల ఆనందంగా ఉంటారు.

మీరు పనిచేసే చోట మీకు విజయాలు అందుతాయి.దీనివల్ల ఈరోజు సంతోషంగా గడుస్తుంది.

తుల:

ఈరోజు మీకు ఆర్థికంగా ఖర్చులు ఉంటాయి.మీ ఆరోగ్య విషయం అనుకూలంగా ఉండదు.ఆర్థికంగా మీ కుటుంబ సభ్యులు సాయపడతారు.

వాయిదా పడిన పనులు పూర్తి చేయడానికి అవకాశం ఉంది.కానీ కొన్ని పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి.

మీ మిత్రుల నుండి సహాయం అందుతుంది.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.మీ వ్యాపార రంగంలో అభివృద్ధి ఉంటుంది.మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.

మీరు పనిచేసే చోట మీకు సలహాలు ఉండడంవల్ల అనుకూలంగా ఉంటుంది.అనుకోకుండా ఇంటికి వచ్చిన అతిధి వల్ల సంతోషంగా గడుపుతారు.

ధనుస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువగానే లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది.

మీరు చేసే పనులు త్వరగా పూర్తి అవుతాయి.ఒక శుభవార్త వింటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

మకరం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఖర్చులు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఖర్చు పెరుగుతుంది.కొన్ని ముఖ్యమైన ప్రయాణాలు చేస్తారు.

వ్యాపార రంగంలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి.వీటి వల్ల ఒత్తిడికి గురవడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

ఇతరులతో వాదనలకు దిగకండి.

కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం కష్టమవుతుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఈరోజు తీర్థయాత్రలు వంటి ప్రయాణాలు చేస్తారు.బంధు మిత్రులతో జాగ్రత్తగా మాట్లాడండి.

వ్యాపార విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.

మీనం

:

ఈరోజు మీకు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తీరిక లేని సమయం గడుపుతునందున్న దాని నుండి ఈరోజు ఉపశమనం కలుగుతుంది.

మీరు పని చేసే చోట ప్రశంసలు అందుతాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి లో లాభాలు ఉన్నాయి.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

తాజా వార్తలు