జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర( Devara ) ఇప్పటికే వేర్వేరు కారణాల వల్ల ఒకసారి వాయిదా పడిన సంగతి తెలిసిందే.దేవర వాయిదా( Devara Postpone ) పడటం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఎంతగానో బాధపెట్టింది.
అయితే దేవర మూవీ మళ్లీ వాయిదా పడనుందంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.మేకర్స్ ఈ తరహా ప్రచారం విషయంలో వెంటనే అప్రమత్తమైతే మంచిది.
ఈ ప్రచారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సినిమా రిజల్ట్ పై ఎఫెక్ట్ పడే అవకాశాలు అయితే ఉంటాయి.దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా ఫస్ట్ పార్ట్ ఆలస్యమైతే సెకండ్ పార్ట్ కూడా ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయి.
దేవర సినిమా షూటింగ్( Devara Shooting ) దాదాపుగా ఇప్పటికే పూర్తైంది.ఈ సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశాలు దాదాపుగా లేనట్టేనని సమాచారం అందుతోంది.
దేవర సినిమాలో యాక్షన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని మాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో సముద్ర తీరప్రాంతపు బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.దేవర సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాలని అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
దేవర సినిమాలో తారక్ తండ్రీ కొడుకుల పాత్రల్లో నటిస్తున్నారని ప్రచారం జరుగుతున్నా ఆ ప్రచారంలో వాస్తవాలు తెలియాల్సి ఉంది.కొరటాల శివ( Koratala Shiva ) ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ఎంతో కష్టపడి పని చేశారని సమాచారం అందుతోంది.దేవర సినిమా సెకండ్ సింగిల్ అతి త్వరలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.
దేవర సినిమా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిందని తారక్ కోరుకున్న హిట్ ను అందించే సినిమా ఇదేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.