రాజన్న సిరిసిల్ల జిల్లాలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాతోటు హూస్సెన్ జూలై 18న పర్యటించనున్నారు.జూలై 18న గురువారం ఉదయం 6 గంటలకు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హైదరాబాదులోని హబ్సీగూడ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి వేములవాడ చేరుకుంటారని, వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం అనంతరం ఉదయం 11 గంటలకు సమీకృత
జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇతర జిల్లా స్థాయి అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహిస్తారని, అనంతరం లంచ్ స్వీకరించి మధ్యాహ్నం మూడు గంటలకు ట్రైబల్ ఏరియాలో క్షేత్రస్థాయి పర్యటన ఉంటుందని, అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి హైదరాబాద్ హబ్సిగూడ కు బయలుదేరనున్నారు.