Ashu Reddy: తనతో ఎక్కువ రోజులు ఎవరుండలేరంటూ ఎమోషనలవుతున్న అషురెడ్డి.. వైరల్ స్టోరీ?

మామూలుగా కొందరి జీవితాల్లో కొంతమంది వ్యక్తులు ఎక్కువ కాలం ఉండలేక పోతారు.ఏదో ఒక కారణంగా దూరమవుతూ ఉంటారు.

దాంతో వాళ్లు చాలా ఫీల్ అవుతూ బాధపడుతూ ఉంటారు.తమ దగ్గరికి ఎవరు వచ్చినా ఉండలేరు అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటారు.

మామూలుగా వారి దగ్గర ఉండకపోవడానికి కారణం వారి ప్రవర్తనలో తేడా అయిన రావచ్చు లేదా అవతలి వ్యక్తి సరిగ్గా ఉండలేకపోవచ్చు.ఇలా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది.

అయితే అషు రెడ్డి( Ashu Reddy ) జీవితంలో కూడా ఎవరు వచ్చినా కూడా వెంటనే వెళ్లిపోతారని తెలుస్తుంది.అషు రెడ్డి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Advertisement

సోషల్ మీడియా ద్వారా అందరి దృష్టిలో పడి సోషల్ మీడియా స్టార్ గా ఎదిగింది.ఆ హోదాతో సినీ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టింది.

వెండితెరపై, బుల్లితెరపై అవకాశాలు అందుకుంది.బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొని బాగా సందడి చేసింది.

షో తర్వాత సోషల్ మీడియాలలో నానా హంగామా చేసింది.

సింగర్ రాహుల్ తో( Singer Rahul ) తిరుగుతూ అతని మీద మీద పడుతూ దిగిన ఫోటోలను పంచుకొని బాగా రచ్చ రచ్చ చేసింది.ఆ తర్వాత యాంకర్ గా కూడా ఆమెకు అవకాశం ఇచ్చింది.అదే సమయంలో ఆమె కాంట్రవర్సరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో( Ram Gopal Varma ) బోల్డ్ ఇంటర్వ్యూ చేసి అందరి దృష్టిలో పడింది.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !

ఇక అలా కొన్ని షోలల్లో చేసి మళ్లీ నాన్ స్టాప్ బిగ్ బాస్ లో అవకాశం అందుకుంది.

Advertisement

అందులో కూడా బాగా రెచ్చిపోయింది.ఇక ఈ షో తర్వాత బుల్లితెరకు పూర్తిగా బ్రేక్ ఇచ్చేసింది.అంతేకాకుండా రాంగోపాల్ వర్మతో రెండోసారి మరింత బోల్డ్ ఇంటర్వ్యూ చేసి బాగా రెచ్చిపోయింది.

వర్మ కూడా ఆమె కాళ్లు పట్టుకొని బాగా దిగజారి పోయాడు.ఇక ఇప్పుడు అన్నిటికీ దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో అందాల ఆరబోతను మొదలుపెట్టింది.

పొట్టి పొట్టి బట్టలు వేస్తూ బాగా స్కిన్ షో చేస్తుంది.ఏమాత్రం మొహమాటం పడకుండా అన్ని అందాలను బయట పెట్టడానికి సిద్ధంగా ఉంది.ప్రతిరోజు ఏదో ఒక ఫోటోను వదలకుండా అస్సలు ఉండలేదు ఈ బ్యూటీ.

అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో కూడా ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.నెగటివ్ కామెంట్లు వస్తే వెంటనే ఫైర్ అవుతూ ఉంటుంది.

ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఫాలోవర్స్ తో మరోసారి ముచ్చట్లు పెట్టింది.ఇక వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చింది.

అయితే ఓ అభిమాని.అక్క నాకు నీతో ఉండాలని ఉంది.

కనీసం పిఎగా అయినా ఉంటా అక్క అంటూ రిక్వెస్ట్ చేస్తూ కనిపించింది.దాంతో అషు రెడ్డి ఎమోషనల్ అవుతూ ఎక్కువ రోజులు ఎవరు ఉండలేరు నాన్న అంటూ కామెంట్ చేసింది.

ప్రస్తుతం ఆ స్టోరీ వైరల్ అవుతుంది.

తాజా వార్తలు