Ashish vidyarthi : మా అబ్బాయితో ఆ విషయం చెప్పడానికి ఇబ్బంది పడ్డాను.. ఆశిష్ విద్యార్థి కామెంట్స్ వైరల్?

తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు ఆశిష్ విద్యార్థి( Ashish vidyarthi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో ఆశిష్ విద్యార్థి పేరు కూడా ఒకటి.

57 ఏళ్ల వయసులో రెండవ వివాహం చేసుకొని ఒక్క సారిగా అభిమానులకు షాక్ ఇవ్వడంతో పాటు వార్తలు నిలిచారు.దాంతో అతని పెళ్లిపై పలువురు నెటిజన్స్ స్పందిస్తూ ఏకీపారేస్తుండగా మరికొందరు మాత్రం అతనికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.

అంతే కాకుండా పెళ్లి తర్వాత వరుసగా ఏదో ఒక విషయంలో వార్తలు నిలుస్తూనే ఉన్నారు ఆశిష్ విద్యార్థి.

Ashish Vidyarthi Says He And His First Wife Broke This News To Their Son Arth

ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయనకు సంబంధించి మరొక వార్తా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే.తాజాగా ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు ఆశిష్ విద్యార్థి.

Advertisement
Ashish Vidyarthi Says He And His First Wife Broke This News To Their Son Arth-A

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.నేను, పీలూ ఇద్దరం మా అబ్బాయికి ఇలాంటి జీవితాన్ని ఇవ్వాలనుకోలేదు.

అలా అని మేమిద్దరం కలిసి ఉండలేం.గందరగోళానికి గురవుతూ ఒకే ఇంట్లో ఉన్నాము.

మా విషయాన్ని మా అబ్బాయి ఆర్త్‌ కనిపెట్టగలడు.అది తనపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

కొన్ని కలిసిరానప్పుడు మంచి వ్యక్తులు కూడా శత్రువులుగా మారతారు.

Ashish Vidyarthi Says He And His First Wife Broke This News To Their Son Arth
రక్తపు మరకల దుస్తులతోనే తండ్రికి కూతురు అంత్యక్రియలు.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటలు విని ఎంతో సంతోషించాను.. నాగచైతన్య కామెంట్స్ వైరల్!

ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకే ఇంట్లో ఉంటూ దానిని పరిష్కరించుకోవాలని చాలా మంది సలహాలు చెబుతుంటారు.కానీ అలాంటి వాటి వల్ల ఉపయోగం లేదని నా అభిప్రాయం.అందుకే మేము కలిసి ఉండలేమని నిర్ణయించుకున్నాక మా అబ్బాయికి విషయాన్ని చెప్పాము.

Advertisement

అతడు మా కంటే గొప్పగా ఆలోచించాడు.మేము చెప్పింది వినగానే సరే అన్నాడు.

మేము తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాడు.మీరు ఇలా కలిసి ఉండి ఇబ్బంది పడడం కంటే.

ఎవరికి వారు విడిగా ఉండడమే మంచిది అని చెప్పాడు.అతడు చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తాడు అని చెప్పుకొచ్చాడు ఆశిష్ విద్యార్థి.

ఇక తన మొదటి భార్య పీలూ( Peloo ) విద్యార్థితో ఆయన 22 ఏళ్ల పాటు కలిసి ఉన్నారు.రెండేళ్ల క్రితం ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తిన కారణంగా వీరిద్దరు స్నేహ పూర్వకంగా విడిపోయినట్లు ఇటీవల ఒక వీడియోలో తెలిపారు.

తాజా వార్తలు