ఒక్క సినిమా హిట్టైతే ఈ హీరోయిన్లు బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమా.. వీళ్లు ఎవరంటే?

మాములుగా కొందరు హీరోయిన్ లకు ఎన్ని సినిమా లలో నటించిన సరైన గుర్తింపు దక్కదు.

మరికొందరికి ఒకటి రెండు సినిమాలలో నటించగానే మంచి గుర్తింపు రావడంతో పాటు ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోతుంటారు.

ఇంకా కొంతమంది హీరోయిన్ లకు నాలుగైదు హిట్లు పడితే కానీ సరైన గుర్తింపు రాదు.చిన్న చిన్న హీరోలతో నటించి మెప్పిస్తే స్టార్‌ హీరోల సినిమాల్లో చాన్స్‌ వస్తుంది.

అక్కడ ఒక్క హిట్‌ పడితే చాలు ఇక స్టార్‌ హీరోయిన్‌ అయిపోతారు.వరుస అవకాశాలు వస్తాయి.

అలా ఒక్క హిట్ సినిమా పడితే చాలు, ఈ హీరోయిన్ లు ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయం.

Advertisement

మరి ఇంతకీ ఆ హీరోయిన్ లు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.మాళవికా మోహన్‌.( Malavika Mohanan ) ఈమె తమిళ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

రజినీకాంత్, విజయ్‌ లాంటి స్టార్‌ హీరోల సినిమాల్లో నటించింది.మాస్టర్ మూవీతో సూపర్‌ హిట్‌ ను అందుకుంది.

అయితే ఈ బ్యూటీ ఇంతవరకు టాలీవుడ్‌ సినిమాల్లో నటించలేదు.

ఇప్పుడు ఏకంగా పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌( Prabhas ) సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది.మారుతి-ప్రభాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రాజాసాబ్‌( Rajasaab ) చిత్రంలో మాళవిక హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ సినిమా విడుదలై హిట్టయితే మాత్రం మాళవిక స్టార్‌ హీరోయిన్‌గా మారడం ఖాయం.

వయస్సు పెరుగుతున్నా లుక్స్ విషయంలో అదుర్స్. చిరుకు మాత్రమే సాధ్యమంటూ?
పెండింగ్ పనులు తోరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

మరో హీరోయిన్ జాన్వీ కపూర్‌.( Janhvi Kapoor ) దీవంగత నటి, అందాల తార శ్రీదేవి ముద్దుల కూతురిగా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్‌.

Advertisement

అక్కడ వరుస సినిమాలు చేసినప్పటికి రావాల్సినంత గుర్తింపు రాలేదు.దీంతో ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్‌పై కన్నేసింది.

తొలి సినిమాతోనే ఎన్టీఆర్‌తో నటించే చాన్స్‌ కొట్టేసింది.కొరటాల శివ, ఎన్టీఆర్‌ కాంబోలో తెరకెక్కుతున్న దేవర మూవీలో( Devara ) జాన్వీ కపూర్ హీరోయిన్‌ గా నటిస్తోంది.అంతేకాదు రామ్‌ చరణ్‌ బుచ్చిబాబు కాంబినేసన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ రెండు చిత్రాలు విడుదలై హిట్టయితే సౌత్‌లో ఈ బ్యూటీకి వరుస సినిమా అవకాశాలు రావడం ఖాయం.మరొక హీరోయిఅషికా రంగనాథ్‌కి మాత్రం రెండో సినిమాతోనే మెగాస్టార్‌ సరసన నటించే అవకాశం దక్కింది.

నా సామిరంగ మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇప్పుడు వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర మూవిలో( Vishwambhara ) నటిస్తోంది.

ఈ సినిమా రిలీజ్‌ తర్వాత అషికాకు తెలుగులో వరుస సినిమాలు వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు