క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తున్నారా... ఇలా చేయకపోతే నష్టపోవడం తప్పదు..!

ఈ రోజుల్లో చాలామంది క్రెడిట్ కార్డులను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు.

డబ్బు లేకపోయినా అవసరమైనవి ఈజీగా కొనుగోలు చేయొచ్చనే ఉద్దేశంతో క్రెడిట్ కార్డులు తీసుకునేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.

అయితే క్రెడిట్ కార్డ్ అనేది రెండు వైపులా పదునున్న ఒక కత్తిలాంటిది.దీన్ని ఎంత తెలివిగా వాడుకుంటే అన్ని ప్రయోజనాలు ఉంటాయి.

లేదంటే నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది.

కానీ ఎక్కువమంది ప్రజలు తమ కార్డు వినియోగాన్ని ప్రతిబింబించే స్టేట్‌మెంట్‌ను పెద్దగా పరిశీలించారు.ఇలా చేస్తే తప్పుగా నమోదైన ట్రాన్సాక్షన్లను మీరు చూడలేరు.

Advertisement

అంతిమంగా మీకు తెలియకుండానే నష్టం జరుగుతుంది.ఒకవేళ మీరు స్టేట్‌మెంట్‌ను పరిశీలిస్తే ఈ తప్పుల గురించి బ్యాంక్ తో చర్చించి కరెక్ట్ చేసుకోవచ్చు.అయితే మరి ఈ తప్పులను ఎలా గుర్తించాలి, నష్టాలను ఎలా నిరోధించాలో ఇప్పుడు తెలుసుకుందాం.1.పేమెంట్ డ్యూ డేట్ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో స్టేట్‌మెంట్‌ డ్యూ డేట్, పేమెంట్ డ్యూ డేట్ అనే 2 వివరాలు ఉంటాయి.

స్టేట్‌మెంట్‌ డ్యూ డేట్ అంటే మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ జనరేట్ అయిన డేట్ అని అర్థం.దీనిని పేమెంట్ డ్యూ డేట్ గా పొర పాటు పడకూడదు.పేమెంట్ డ్యూ డేట్ అంటే మీరు బకాయి మొత్తాన్ని బ్యాంకుకి చెల్లించాల్సిన లాస్ట్ తేదీ.2.చెల్లించాల్సిన కనీస మొత్తం కొన్ని కంపెనీలు గ్రేస్ పీరియడ్ లోగా చెల్లించిన వాటిపై వడ్డీ వసూలు చేయవు.

గ్రేస్ పీరియడ్ దాటిన తర్వాత మీ బకాయిలపై వడ్డీ వసూలు చేస్తాయి.అయితే మీరు స్టేట్‌మెంట్‌లో చెల్లించాల్సిన మొత్తం ఎంతుందో గమనించాల్సిన అవసరం ఉంది.అలాగే కనీస మొత్తం చెక్ చేసి ఆ అమౌంట్ చెల్లించడం ద్వారా వడ్డీ భారం నుంచి బయటపడొచ్చు.3.మీ ట్రాన్సాక్షన్ల వివరాలు మీరు నెలలో ఎంత ఖర్చు పెడుతున్నారో అర్థం చేసుకోవడానికి ట్రాన్సాక్షన్ వివరాలను  చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

దీన్ని పరిశీలించడం ద్వారా మీరు అనవసరంగా చేస్తున్న ఖర్చులను గుర్తించడం సులభమవుతుంది.అలా మీ నెలవారి ఖర్చు ఈజీగా తగ్గించుకోవచ్చు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

4.రివార్డ్ పాయింట్లు చాలా క్రెడిట్ కార్డు కంపెనీలు కస్టమర్లకు రివార్డ్ పాయింట్లు ఆఫర్ చేస్తుంటాయి.అయితే స్టేట్‌మెంట్‌లో మీకు ఎన్ని రివార్డ్ పాయింట్స్ ఉన్నాయో, వాటిని ఏ తేదీలోగా వాడుకోవాలో చెక్ చేయాలి.

Advertisement

లేదంటే అవి ఎక్స్‌పైరీ అయిపోయి వృథాగా మారుతాయి.

తాజా వార్తలు