వారంలో 2 సార్లు ఈ ఆయిల్ ను రాసుకుంటే తెల్ల జుట్టు దరిదాపుల్లోకి కూడా రాదు!

ఇటీవల కాలంలో చాలా మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో తీవ్రంగా సతమతమవుతున్నారు.చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.

పోషకాల లోపం, ఒత్తిడి, కాలుష్యం, హెయిర్ స్టైలింగ్ టూల్స్‌ను అధికంగా వినియోగించడం తదితర అంశాలు మెలనిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది.మెల‌నిన్‌ ఉత్పత్తి తగ్గుతుంది అంటే ఆటోమేటిక్ గా వెంట్రుకలు తెల్లబడతాయి.

అయితే తెల్ల జుట్టు వచ్చాక బాధపడటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు అంటున్నారు నిపుణులు.అయితే తెల్ల జుట్టుకు అడ్డుకట్ట వేయడంలో ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ ఆయిల్ అద్భుతంగా సహాయపడుతుంది.

వారంలో రెండంటే రెండు సార్లు ఈ ఆయిల్ ను రాసుకుంటే తెల్ల జుట్టు దరిదాపుల్లోకి కూడా రాదు.మరి ఇంతకీ ఆ ఆయిల్ ను ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఎండిన ఉసిరి ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు కలోంజి సీడ్స్ వేసుకుని కనీసం నాలుగు నిమిషాల పాటు వేయించుకోవాలి.ఇలా వేయించుకున్న ఉసిరి ముక్కలు మరియు కలోంజీ సీడ్స్ ను చల్లార బెట్టుకోవాలి.

పూర్తిగా చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు కొబ్బరి నూనె వేసుకోవాలి.

అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరి కలోంజి పొడి వేసి పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.ఆపై స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ ఆయిల్ కంప్లీట్ గా కూల్ అయిన వెంటనే ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.

నైట్ నిద్రించడానికి గంట ముందు ఈ ఆయిల్ ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకుని ఒక పది నిమిషాల పాటు హెడ్ మసాజ్ చేసుకోవాలి.మరుస‌టి రోజు ఉదయాన్నే మైల్డ్ షాంపూను ఉపయోగించి తల స్నానం చేయాలి.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

వారంలో రెండు సార్లు ఈ ఆయిల్ వాడితే కనుక తెల్ల జుట్టు రానేరాదు.కురులు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తాయి.

Advertisement

అలాగే ఈ ఆయిల్ ను వాడటం వల్ల హెయిర్ ఫాల్‌ చుండ్రు వంటి సమస్యలు సైతం దూరం అవుతాయి.

తాజా వార్తలు