హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు రాచకొండ పోలీసులు.ఈ క్రమంలో ఒక నైజీరియన్ తో పాటు మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
నిషేధిత డ్రగ్స్ ను ముంబై నుంచి హైదరాబాద్ కు సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.అనంతరం నిందితుల నుంచి 30 గ్రాముల ఎండీఎంఏతో పాటు ఇతర డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా మరో కేసులో అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు.
నిందితుల నుంచి 45 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు మధ్యాహ్నం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.







