డ్రై హెయిర్‌ను నివారించే యాపిల్ సైడర్ వెనిగర్‌..ఎలాగంటే?

సాధార‌ణంగా చాలా మంది డ్రై హెయిర్ స‌మ‌స్య‌తో బాధ ప‌డుతుంటారు.ఇలాంటి వారి హెయిర్ స్మూత్‌గా కాకుండా.

పొడిగా చింపిరి చింపిరిగా ఉంటుంది.జుట్టు డ్రైగా ఉండ‌టం వ‌ల్ల‌.

కాస్త అందవిహీనంగా క‌నిపిస్తారు.అందుకే డ్రై హెయిర్‌ను నివారించుకునేందుకు ర‌క‌ర‌కాల షాంపూలు, ఆయిల్స్ వాడుతుంటారు.

అయిన‌ప్ప‌టికీ, ఫ‌లితం లేకుండా ట్రీట్మెంట్లు కూడా చేయించుకుంటారు.కానీ, ఇంట్లోనే కొన్ని కొన్ని చిట్కాలు ఫాలో అయితే సులభంగా పొడి చుట్టుకు చెక్ పెట్ట‌వ‌చ్చు.

Advertisement

ముఖ్యంగా యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ డ్రై హెయిర్‌ను నివారించ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.సాధార‌ణంగా యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను స‌లాడ్స్‌లో రుచి కోసం మ‌రియు చ‌ర్మ సౌంద‌ర్యానికి వినియోగిస్తుంటారు.

అయితే కేశ సంర‌క్ష‌ణ‌కు కూడా యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది.డ్రై హెయిర్‌తో బాధ ప‌డే వారు.

ఒక బౌల్‌లో రెండు చుక్క‌ల‌ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ మ‌రియు రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి.త‌ల‌కు, కేశాల‌కు అప్లై చేయాలి.

ఒక గంట పాటు వ‌దిలేసి.ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయాలి.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.జుట్టు స్మూత్ అండ్ సిల్కీగా మారుతుంది.

Advertisement

అలాగే జుట్టు రాల‌డం త‌గ్గి.ఒత్తుగా, పొడ‌వుగా కూడా పెరుగుతుంది.

అలాగే ఒక బౌల్‌లో కొద్దిగా నీళ్లు, రెండు లేదా మూడు చుక్క‌ల యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ మ‌రియు నిమ్మ ర‌సం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు, జుట్టుకు, కుదుళ్ల‌కు బాగా అప్లై చేసి.

ఒక గంట పాటు ఆర‌నివ్వాలి.ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో హెడ్ బాత్ చేయాలి.

ఇలా మూడు రోజుల‌కు ఒక సారి చేస్తే.హెయిర్‌గా సాఫ్ట్‌గా మారుతంది.

మ‌రియు చుండ్రు స‌మ‌స్య కూడా దూరం అవుతుంది.

తాజా వార్తలు