AP PCC Chief Sharmila : రేపటి నుంచి ఏపీసీసీ చీఫ్ షర్మిల జిల్లాల పర్యటన

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల( AP PCC Chief Sharmila ) జిల్లాల పర్యటనకు ముహుర్తం ఖరారు అయింది.

ఈ మేరకు ఆమె రేపటి నుంచి జిల్లాల పర్యటకు( Districts Tour ) వెళ్లనున్నారు.

ఈ నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని కోరుతూ షర్మిల రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ కు( DGP Rajendranath ) లేఖ రాశారు.జిల్లాల పర్యటనలో భాగంగా ముందుగా రేపు బాపట్లలో పర్యటించనున్న వైఎస్ షర్మిల అక్కడ కాంగ్రెస్ ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.

ఎల్లుండి తెనాలిలో రచ్చబండ( Tenali Rachabanda ) నిర్వహించనున్నారు.ఈనెల 8వ తేదీన ఉంగుటూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసే సభలో పాల్గొననున్నారు.ఈనెల 9న కొవ్వూరు, తుని నియోజకవర్గంలో సభలకు షర్మిల హాజరుకానున్నారు.

ఈనెల 10న నర్సీపట్నం, పాడేరు నియోజకవర్గంలో మరియు 11న నగరి నియోజకవర్గంలో షర్మిల బహిరంగ సభలను నిర్వహించనున్నారు.

Advertisement
అమ్మమ్మ చీర కట్టుకోవాలని ఉంది...ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను : సాయి పల్లవి

తాజా వార్తలు