అమరావతి నిర్మాణం, ్రపభుత్వ పథకాలు, ్రపోజక్టులు ఒకటేమిటి అన్నింటా అవినీతి పాల్పడుతు, అక్రమార్జన చేస్తున్న ఆం్రధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లు 2019లో జైళ్లకు వెళ్లడం ఖాయమని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు.అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో ని తన స్వగృహంలో ఆయన మీడియాతో మాట్లడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చిన ఈ రెండేళ్లలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని, దేశంలోనే అవినీతి రాష్ట్రంగా మార్చేసారని మండి పడ్డారాయన.
గత ఏడాది గోదావరి పుష్కరాల్లో అరకొరగా సౌకర్యాలు కల్పించి 27 మందిని పొట్టను పెట్టుకున్న చంద్రబాబు రూ.1,600 కోట్లు అవినీతికి పాల్పడినట్టు రుజువులున్నాయని అన్నారు.ఇప్పుడు కృష్ణా పుష్కరాల ముసుగులో భారీగా అవినీతి జరుగుతోందని విమర్శంచారు.
విభజన చట్టంలోని అంశాల అమలుపై బీజేపీ, టీడీపీలకు ్రశద్ధలేదని, ఉద్దేశపూర్వంగానే ఈ రెండు పార్టీలు ప్రజలను అయోమయంకు గురి చేస్తు, ప్రభుత్వాలు పోటీ పడి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు.
పెట్టు బడుల కోసమంటూ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనల కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తు పెడుతున్నా, ఒక్క పైసా కూడా ఎవ్వరూ విదల్చడంలేదన్నది నిజమని అన్నారు.అవినీతి చ్రకవర్తి చంద్రబాబుకు దేవుడన్నా భయంలోదని, విస్తరణలపేరుతో తమన అధికారులను దేవాలయాలపైకి పురిగొల్పి, కూలగొట్టిస్తున్నారని రఘువీరా వ్యాఖ్యానించారు.