ఏపీ సీఎం జగన్ ఇప్పటికే రకరకాల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కేంద్రం నుంచి, ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
వైసీపీ అధికారంలో కి వచ్చిన మొదట్లో చాలా ధీమా గానే ఉన్నట్లు కనిపించినా, ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు కాస్త ఇబ్బందికరంగా మారాయి.మొన్నటి వరకు కేంద్ర అధికార పార్టీ బిజెపి సన్నిహితంగా ఉన్నట్టుగానే కనిపించినా, ఇప్పుడు మాత్రం జగన్ తమకు బద్ధశత్రువు అని బహిరంగంగానే ప్రకటించేస్తోంది.
గతంలో టిడిపి బిజెపి పొత్తు రద్దయిన తర్వాత ఏ విధంగా అయితే ఆ పార్టీని టార్గెట్ చేసిందో ఇప్పుడు అదే తరహాలో వైసిపి నీ టార్గెట్ చేసుకుంటే అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది.
ఇదంతా రాజకీయంగా షరామామూలే.
అయితే వైసీపీకి మరో పెద్ద చిక్కు వచ్చి పడింది.అది సొంత పార్టీ నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలు.
ఈ నియోజకవర్గం, ఆ నియోజకవర్గం అనే తేడా లేకుండా ప్రతి నియోజకవర్గంలోనూ, గ్రూపు రాజకీయాలు ఎక్కువైపోయాయి.ప్రతి నియోజకవర్గంలోనూ, మొదటి నుంచి వైసీపీ తో ఉన్న వారు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారి మధ్య తగాదాలు ఎక్కువగా ఉన్నాయి.
ముందు నుంచి వైసీపీలో ఉన్న వారు సైతం రెండు వర్గాలుగా విడిపోవడం అన్ని చోట్లా కామన్ అయిపోయింది.ఈ గ్రూప్ రాజకీయాల కారణంగా పార్టీ , ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతోంది.
ఎప్పటికప్పుడు ఈ విషయంపై జగన్ దృష్టి పెట్టబోతున్నారు అంటూ పార్టీ నేతలకు సంకేతాలు ఇస్తూనే ఉన్నారు.

కొంతమంది వైసీపీలో ని ముఖ్య నాయకులకు ఈ తరహా తగాదాలు తీర్చవలసిందిగా జగన్ ఆదేశాలు ఇస్తున్నప్పటికీ పార్టీలో మాత్రం పరిస్థితి సర్డుకున్నట్టు గా కనిపించడం లేదు.మిగతా రాజకీయ అంశాలు ఎలా ఉన్నా, జగన్ మాత్రం పార్టీలో తీవ్రతరమైన గ్రూపు రాజకీయాలపై దృష్టి పెట్టకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.ఒక వైపు ప్రతిపక్షాలు, ఇంకో వైపు సొంత పార్టీ నేతల మధ్య జగన్ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు గా కనిపిస్తున్నారు.