ఏపీ ఉద్యమాంధ్రప్రదేశ్ గా మారింది : నారా లోకేశ్

టీడీపీ నేత నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఉద్యమాంధ్రప్రదేశ్ గా మారిందన్నారు.

పాదయాత్ర సమయంలో సీఎం జగన్ ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చారన్న ఆయన వాటిని అమలు చేయడంలో విఫలం అయ్యారని దుయ్యబట్టారు.

ఏపీ ప్రజలను సీఎం జగన్ మోసం చేశారని లోకేశ్ ఆరోపించారు.దీంతో డిమాండ్ల సాధన కోసం ఏపీలో కార్మికులు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితులు వచ్చాయని విమర్శించారు.అంగన్ వాడీలతో పాటు మున్సిపల్ కార్మికులకు టీడీపీ మద్ధతు ఇస్తుందని లోకేశ్ స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే కార్మికులకు అండగా ఉంటూ వారితో కలిసి పోరాడాలని టీడీపీ శ్రేణులకు లోకేశ్ పిలుపునిచ్చారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు