100 ఎకరాల విస్తీర్ణంలో భారీ స్టూడియో నిర్మాణం.. పవన్ చొరవతోనే సాధ్యం!

సినీ నటుడు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు వెలుగులు వచ్చాయని చెప్పాలి.

గత ప్రభుత్వం చిత్ర పరిశ్రమ పట్ల కక్ష సాధింపు చర్యలు చేసిందని ఎంతోమంది దర్శక నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు.

సినిమా టికెట్ల రేట్లు తగ్గించడమే కాకుండా బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేయడం వంటి వాటి ద్వారా చిత్ర పరిశ్రమలో ఎన్నో ఇబ్బందులు వచ్చాయి.అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ( Ap Deputy CM ) అయిన తరువాత టాలీవుడ్ సినిమాలకు కాస్త ఊపిరి పోసినట్టు అయింది.

Ap Government To Set Up Huge Studio In 100 Acres, Ap Government,film Studio,pawa

సినిమా టికెట్ల రేట్లు పెంచడమే కాకుండా బెనిఫిట్ షోలకు కూడా పర్మిషన్ ఇచ్చారు.ఇకపోతే తాజాగా చిత్ర పరిశ్రమ కోసం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది ఈయన ఏపీ ముఖ్యమంత్రితో సంప్రదింపులు చేసిన తర్వాత ఏపీలో భారీ స్టూడియో నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తుందని తెలుస్తోంది. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్టూడియో నిర్మాణం చేపట్టబోతున్నారని సమాచారం.

ఇందుకు సంబంధించిన ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతలతో సంప్రదించారని తెలుస్తుంది.

Ap Government To Set Up Huge Studio In 100 Acres, Ap Government,film Studio,pawa
Advertisement
Ap Government To Set Up Huge Studio In 100 Acres, Ap Government,Film Studio,Pawa

ఇక ఈ స్టూడియో తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో నిర్మిస్తే కనుక రెండు రాష్ట్రాల రాకపోకలకు అనుగుణంగా ఉంటుందన్న ఉద్దేశంతో కృష్ణాజిల్లాలోని నందిగామ నియోజకవర్గంలో కంచికచర్ల వద్ద భారీ స్టూడియోకు ప్లాన్ జరుగుతున్నదనే వార్తలు బయటకు వస్తున్నాయి.ఇక్కడ కనుక స్టూడియో ఏర్పాటు చేస్తే హైదరాబాద్ కి కేవలం నాలుగు గంటల ప్రయాణం మాత్రమే ఉంటుంది.అలాగే గన్నవరం ఎయిర్ పోర్ట్ కి 40 నిమిషాల సమయం పడుతుంది.

అదే విధంగా రైల్వే స్టేషన్ కు కూడా దగ్గరగా ఉంటుంది.ఇక  ఈ స్టూడియో నిర్మాణం అమరావతికి సమీప ప్రాంతం కావడంతో ఇక్కడ స్థలం ఎంపిక చేశారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు