రిటైర్మెంట్ అస్త్రం వర్కవుట్ అయ్యిందిగా ? వారు హ్యాపీ జగన్ హ్యాపీ

ఏపీను వరుసగా ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి మరెన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.అయినా ఎక్కడా జగన్ అదరడం లేదు బెదరడం లేదు.

నింపాదిగా పరిపాలన కొనసాగించుకుంటూ వెళ్తున్నారు ఎన్ని ఇబ్బందులు వచ్చి మీద పడుతున్నా చిరునవ్వుతోనే వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను అన్న విధంగా సంకేతాలు పంపుతున్నారు.ప్రతిపక్షాలు ఎంతగా జగన్ ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా వాటిని తిప్పి కొట్టడం లో జగన్ సక్సెస్ అవుతున్నారు.

ఇక కొద్ది రోజుల క్రితం చూసుకుంటే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.     పిఆర్సి అమలుపై ప్రభుత్వానికి అనేక డిమాండ్లు విధించారు.

అంతేకాదు ప్రభుత్వానికి సవాళ్ళు విసురుతూ మేం తలుచుకుంటే ప్రభుత్వం కూలిపోతుంది అంటూ భారీ స్టేట్మెంట్లు ఇచ్చారు.దీంతో ఉద్యోగ సంఘాల్లో జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయిందని, ఇక రాబోయే ఎన్నికల్లో వైసీపీకి దెబ్బ కొడతారని వైసీపీ రాజకీయ శత్రువులు సంబరపడ్డారు.

Advertisement

అయితే జగన్ మాత్రం ఉద్యోగులకు సంతోషం కలిగించే విధంగా తన నిర్ణయాన్ని ప్రకటించారు.ఉద్యోగులు 27% ఫిట్మెంట్ కు దగ్గరగా అంటే 23.29 శాతం ఫిట్మెంట్ ప్రకటించి వారిని సంతోష పెట్టారు.అంతే కాదు ఉద్యోగులకు రిటైర్మెంట్ ను 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగ సంఘాల్లో ఎక్కడలేని ఆనందం కనిపించింది.

ఎందుకంటే ఉద్యోగులు అంత తొందరగా రిటైర్మెంట్ ను ఒప్పుకోరు.మరికొంతకాలం పొడిగిస్తే బాగుండును అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు.   

  సరిగ్గా ఈ విషయాన్ని అంచనా వేసే జగన్ ఉద్యోగ సంఘాల్లో తమకు మద్దతు తగ్గకుండా జాగ్రత్త పడ్డారు.ప్రస్తుతం ఏపీ ఉన్న ఆర్థిక ఇబ్బందులో అంతకుమించి ఫిట్మెంట్ ఇవ్వలేమని, వారికి అర్థమయ్యేలా చెప్పి వారు సమ్మెబాట పట్టకుండా జగన్ తెలివిగా వ్యవహరించారు.అంతేకాదు  ఉద్యోగ సంఘాల నాయకుడు బండి శ్రీనివాసరావు వచ్చేనెలలో రిటైర్మెంట్ అవుతున్నారు.

ఇప్పుడు రిటైర్మెంట్ 62 ఏళ్లకు పెంచుతూ జగన్ నిర్ణయం ప్రకటించగానే ఆయన వెంటనే జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ విధంగా ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకం కాకుండా జగన్ చాలా తెలివిగా వ్యవహరించారు .

వైసీపీ కార్యాలయం కూల్చివేత పై జగన్ ఏమన్నారంటే ? 
Advertisement

తాజా వార్తలు