పవన్ చంద్రబాబుపై జగన్ సెటైర్లు

టిడిపి అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ సీఎం జగన్( AP CM YS Jagan ) సెటైరిక్ కామెంట్స్ చేసారు.

సామర్లకోట లో సామూహిక గృహ ప్రవేశాలు కార్యక్రమంలో పాల్గొన్న జగన్ అక్కడ ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు,  పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

చంద్రబాబు కంటిన్యూగా నెలరోజుల పాటు మన రాష్ట్రంలో ఉన్నారా ?  చంద్రబాబు( Chandrababu ) ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు లో ఉన్నారు.చంద్రబాబు ,లోకేష్ , దత్తపుత్రుడు,  బాలకృష్ణ ఎవరు మన రాష్ట్రంలో ఉండరు.

  దత్తపుత్రుడు శాశ్వత చిరునామా హైదరాబాద్.  దత్తపుత్రుడు పెళ్ళాలు మాత్రం మూడు నాలుగు ఏళ్లకు మారుతుంది .

ప్యాకేజీ స్టార్ కు భీమవరంతో , గాజువాకతో సంబంధం లేదు.ఎల్లో బ్యాచ్ కు ప్రజల మీద ప్రేమ లేదు.వీళ్లకు కావాల్సింది కేవలం అధికారం .వీళ్లు కోరుకునేది ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడం హైదరాబాదులో దోచుకున్నది పంచుకోవడం.  వీళ్లంతా మనతో చేసేది కేవలం వ్యాపారమే.

Advertisement

తన అభిమానుల ఓట్లను హోల్ సేల్  గా అమ్ముకునేందుకు అప్పుడప్పుడు వస్తుంటాడు ప్యాకేజీ స్టార్.సినిమా షూటింగ్ లేని సమయంలో ఇక్కడికి వచ్చి స్టోరీలు చెబుతాడు.

సొంత పార్టీని , సొంత వర్గాన్ని అమ్ముకునే ఓ వ్యాపారి పవన్( Pawan Kalyan ) అంటూ జగన్ మండిపడ్డారు.వివాహ వ్యవస్థ( Marriage System ) పై దత్త పుత్రుడికి గౌరవం లేదు.

మన మట్టి ,మన మనుషులతో అనుబంధం లేని వ్యక్తులు వీరు.  నా ఎస్సీలు, నా ఎస్టీలు,  నా బీసీలు అని కూడా అనలేరు.

ప్యాకేజీ స్టార్ కు మనపై ఎంత ప్రేమ ఉందో కాపులు కూడా ఆలోచించాలి .రాష్ట్రంపై ప్రేమలేని వాళ్లు రాష్ట్రం గురించి ఊగిపోతున్నారు.  బాబుకు అధికారం పోతే వీళ్లకు ప్యుజులు పోతాయి .పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని కోర్టులకు వెళ్తారు.  ప్రభుత్వం ఎంత మంచి చేసినా కుట్రలు చేస్తున్నారు.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

 రాజకీయాలు( Politics ) అంటే విలువలు విశ్వసనీయత ఉండాలి.చెప్పాడంటే చేస్తాడని నమ్మకం ఉండాలి.కష్టమొచ్చినా,  నష్టం వచ్చినా నిలబడేవాడే నాయకుడు.

Advertisement

జగన్ పేరు చెబితే స్కీములు గుర్తుకు వస్తాయి .అదే చంద్రబాబు పేరు చెబితే స్కాం లు( Scam ) గుర్తుకు వస్తాయి .జగన్ పేరు చెబితే లంచాలు లేని డిబిటి పాలన గుర్తుకువస్తుంది.  బాబు పేరు చెబితే గజదొంగల ముఠా,  పెత్తందారుల అధికారం గుర్తొస్తుంది అంటూ జగన్ విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలకు ఎంత మేలు జరిగింది,  ఏ స్థాయిలో అభివృద్ధి జరిగింది అనే అంశాలపై లెక్కలతో సహా జగన్ ప్రజలకు వివరించారు.

తాజా వార్తలు