కుటుంబాలు రోడ్డున పడి చిన్న భిన్నం కావడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు ఒక చిన్న అనుమానం ఉంటే చాలు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.కొంతమంది మూర్ఖులు అనుమానం ఉంటే కూర్చోని నిజా నిజాలు తెలుసుకోకుండా దారుణమైన నిర్ణయాలు తీసుకొని తమ జీవితాలను తామే నాశనం చేసుకుంటున్నారు.
ఇలాంటి కోవలోనే ఓ వివాహిత తన భర్త పరాయి మహిళతో అక్రమ సంబంధం( Illegal Affair ) ఏర్పరచుకొని సంపాదించిన డబ్బంతా ఆ మహిళకే ఖర్చు పెడుతున్నాడనే అనుమానంతో ఏకంగా భర్తని హత్య చేసిన ఘటన కరీంనగర్ లోని( Karimnagar ) గోదావరి ఖనిలో చోటుచేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

సీఐ ప్రమోద్ రావు తెలిపిన వివరాల ప్రకారం.గోదావరి ఖని లోని స్థానిక మార్కండేయ కాలనీకి చెందిన కొచ్చర ప్రవీణ్ (42)( Kochhara Praveen ) చుట్టూ పక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇళ్లు నిర్మించి విక్రయిస్తుంటాడు.కొంత కాలంగా ప్రవీణ్ వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం అతని భార్య లలితకు( Lalitha ) కలిగింది.పైగా ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు కూడా ఈ మధ్యన సరిగా చెప్పకపోవడంతో భర్త పై ఉండే అనుమానం మరి కాస్త పెరిగి బలంగా మారింది.
అయితే ఇందులో నిజం ఉందా లేదా అనే విషయం భర్తతో చర్చించకుండా భర్తను చంపేయాలని నిర్ణయించుకుంది.

తన భర్త ప్రవీణ్ వద్ద పనిచేసే మచ్చ సురేష్( Machha Suresh ) అనే కార్మికుడు తో తన బాధను చెప్పుకొని, తన భర్తకు చంపేందుకు సహకరించాలని కోరితే సురేష్ సరేనని అంగీకరించాడు.ఈనెల 10వ తేదీ అర్ధరాత్రి ప్రవీణ్ ఇంట్లో నిద్రిస్తుండగా లలిత భర్త కాళ్లు కదలకుండా పట్టుకుంది.సురేష్, మరికొందరు నిందితులతో కలిసి దిండుతో ( Pillow ) ప్రవీణ్ ముఖంపై గట్టిగా అదిమి పట్టి శ్వాస ఆడనీయకుండా చేసి చంపేశారు.
ఆ తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని కేసుకు సంబంధించిన అన్ని వివరాలు బయటకు వస్తాయని సీఐ తెలిపారు.