అమరావతి భూములపై జగన్ మంకుపట్టు ? కోర్టు చెప్పినా తొందరెందుకో ?

తనకు పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టుగా ఉంటుంది ఏపీ సీఎం జగన్ వ్యవహారశైలి.

జగన్ వ్యవహారం ఇప్పుడు కొత్తేమీ కాకపోయినా ప్రస్తుతం జగన్ వ్యవహారశైలి పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నా ఆయన లో ఏ మార్పు కనిపించడకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది.

ముఖ్యంగా రాజధాని అమరావతి వ్యవహారంలో జగన్ ఎక్కువగా అభాసు పాలయ్యారు.మూడు రాజధానులు అంటూ ముందుకు వెళ్లారు.

అయితే అమరావతి కోసం రైతులు ఇచ్చిన భూములు పరిస్థితి ఏంటి అనే ప్రశ్న తలెత్తినపుడు, దానికి సమాధానంగా రాజధాని కోసం తీసుకున్న భూములను ఇళ్లస్థలాల కోసం పంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది.దీనికోసం ప్రత్యేకంగా జీవోను కూడా జారీ చేసింది.

అయితే దీనికి హైకోర్టులో బ్రేక్ పడింది.ప్రభుత్వ జీవోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పడంతో జగన్ నిర్ణయానికి బ్రేక్ ఏర్పడింది.

Advertisement

అయితే తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు ఇష్టపడని జగన్ మరో జీవోను జారీ చేశారు.

హైకోర్టు ఆదేశాలను పాటిస్తూనే అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కి ఏర్పాటు చేయాలంటూ గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.అయితే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ అమరావతి భూములు ఏ విధంగా కేటాయించాలో తెలియక ప్రభుత్వ అధికారులు కూడా సందిగ్ధంలో పడ్డారు.దీంతో ప్రభుత్వం తరపున హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తామని, ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది.

ఇది ఏమీ ఆలోచించకుండా ముందుగా లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు .చట్టం ప్రకారం చూసుకుంటే అమరావతి పరిధిలో ఉన్న 29 గ్రామాల్లో 5 శాతం భూములను పేదలకు నివాస వసతి కోసం ఉపయోగించాలి అంటే ఆ 29 గ్రామాల్లోని వారి కోసమే ఆ భూమిని ఉపయోగించాలి.కానీ వైసీపీ ప్రభుత్వం కృష్ణ, గుంటూరు జిల్లాలోని ఇతర ప్రాంతాల వారికి కూడా అమరావతి లో ఇళ్ల స్థలాలు కేటాయించే విధంగా వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే హైకోర్టు ఆ జీవోను సస్పెండ్ చేయడంతో ఇప్పుడు అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలంటే సిఆర్డిఏ పరిధిలోని 29 గ్రామాల వారికే స్థలాలు కేటాయించాలనే నిబంధనను మార్చాల్సి ఉంటుంది.ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఆ నిబంధనను మార్చే విధంగా కూడా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
బన్నీని ఆ రిక్వెస్ట్ చేసిన డేవిడ్ వార్నర్... ఓకే చెప్పిన అల్లు అర్జున్?

ప్రస్తుతం రెండు జిల్లాల కలెక్టర్లకు ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశాలిచ్చింది.తాము సుప్రీంకోర్టుకు వెళ్తున్నాము కాబట్టి, ఆ తీర్పు వచ్చాక ఈ ప్రక్రియ మొత్తం ప్రారంభించాలని ప్రభుత్వం చెబుతోంది.

Advertisement

అంటే ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం, దానిపై విచారణ జరగడం, తీర్పు రావడానికి చాలా సమయం పడుతుంది.దీంతో ప్రభుత్వం ఎంత హడావుడిగా జీవోను జారీ చేసే కంటే తీర్పు వచ్చే వరకు వేచి ఉంటే ఎటువంటి వివాదాలు వచ్చి ఉండేవి కాదు కదా అంటూ అధికారులు అంతర్గతంగా చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది.

తాజా వార్తలు