న్యూస్ రౌండప్ టాప్ 20

1.కమలాపూర్ చేరుకున్న కేటీఆర్

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gol

హనుమకొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది.

హుజురాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ కు కేటీఆర్ హెలికాప్టర్ లో చేరుకున్నారు.

2.జగన్ విచారణకు హాజరు కావాల్సిందే

కోడి కత్తి కేసు విచారణకు వచ్చింది.

ఎన్ ఐ ఏ కోర్టులో కోడి కత్తి కేసు విచారణ నేటి నుంచి ప్రారంభమైంది.ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి కోర్టుకు హాజరు కాకపోవడంతో విచారణను ఫిబ్రవరి 15కు వాయిదా వేశారు.తదుపరి విచారణకు బాధితుడు సీఎం జగన్ సైతం విచారణకు హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

3.లోకేష్ పాదయాత్ర

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gol

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర నేటికి ఐదవ రోజుకు చేరుకుంది.ఈరోజు ఉదయం వీకోట మండలం దానమయ్య గారి పల్లె నుంచి పాదయాత్ర ప్రారంభమైంది.

4.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్ది సాధారణంగా ఉంది.నేడు స్వామి వారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.

5.తెలంగాణ బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gol
Advertisement

తెలంగాణ బడ్జెట్ కు గవర్నర్ తమిళసై ఆమోదం తెలిపారు.

6.డిజిటల్ విద్యపై ఐఐటీలో జీ 20 సదస్సు

జి 20 దేశాల తరఫున విద్యారంగ కార్యాచరణ కమిటీ తొలి సదస్సు చెన్నైలో భారీ భద్రత మధ్య ప్రారంభమైంది.

7.హైదరాబాదులో ఐటీ రైట్స్

హైదరాబాదులో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి.వసుదా ఫార్మకేం లిమిటెడ్ తో పాటు , అనేక కంపెనీలపై ఐటి అధికారులు సాదాలు నిర్వహిస్తున్నారు .మొత్తం 40 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.

8.పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.బడ్జెట్ ప్రవేశపెట్టేముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు.

9.ఢిల్లీ సీఎంకు బెదిరింపు కాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను చంపేస్తామంటూ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు కాల్ చేశారు.దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

10.మూడు రాజధానులపై సుప్రీం లో విచారణ

మూడు రాజధానులపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ ఈ రోజు జరగనుంది.

11.టీచర్ల బదిలీల దరఖాస్తు గడువు పొడిగింపు

టీచర్ల బదిలీలకు దరఖాస్తు గడువు సోమవారంతో ముగిసింది.దీంతో ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థన మేరకు ట్రాన్స్ఫర్లకు దరఖాస్తు గడువును పెంచారు.

12.ఏపీ ప్రభుత్వంపై సునీల్ దియోధర్ కామెంట్స్

ఎండోమెంట్ నుంచి పాస్టర్లకు వేతనాలు ఇవ్వడం ఏమిటని వైసిపి ప్రభుత్వాన్ని బిజెపి ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ ధియోధర్ ప్రశ్నించారు.

13.పార్టీ క్యాడర్ తో ఆనం రామనారాయణ రెడ్డి భేటీలు

పురుషుల్లో హెయిర్ ఫాల్ ను స్టాప్ చేసే సూప‌ర్ టిప్స్‌!
పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?

వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ క్యాడర్ తో సమావేశాలు నిర్వహిస్తున్నారు.వైసీపీ అధిష్టానం రామనారాయణ రెడ్డిని పక్కన పెట్టడంతో తన రాజకీయ భవిష్యత్తుపై ఆయన కేడర్ తో చర్చలు జరుపుతున్నారు.

14.టిడిపి ఎమ్మెల్సీ ఆరోగ్యం విషమం

టిడిపి ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

15.అచ్యుతాపురం సెజ్ లో పేలిన రియాక్టర్

Advertisement

 అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి ( సెజ్) లో భారీగా పేలుడు సంభవించింది.లాలం కోడూరు సమీపంలో ఉన్న జి ఎఫ్ ఎం ఎస్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది.ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.

16.విద్యార్థులకు అస్వస్థత

ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల విద్యాలయంలో 206 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు.ఫుడ్ పాయిజన్ కావడమే దీనికి కారణంగా అధికారులు భావిస్తున్నారు.

17.భారత దేశ వీసీల సదస్సు ప్రారంభం

విశాఖ నగరంలోని ఏయూ కన్వెన్షన్ హాల్ లో దక్షిణ భారత దేశ వీసీల సదస్సును ఏపీ గవర్నర్ భిస్వ భూషణ్ హరిచందన్ ప్రారంభించారు.

18.మంత్రి కేటీఆర్ పర్యటనలో ఉద్రిక్తత

తెలంగాణ మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లా పర్యటనలు ఉద్రిక్తతలు నెలకున్నాయి.ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

19.రాజాసింగ్ కు మళ్లీ పోలీసుల నోటీసులు

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి పోలీసులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.నోటీసుల్లో కోర్టు పేర్కొన్న బెయిల్ షరతులను రాజాసింగ్ ఉల్లంఘించారని పేర్కొన్నారు.అంతకుముందు పిడిఎఫ్ కేసులో రాజాసింగ్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.ఇప్పుడు ఆ నిబంధనలు ఉల్లంఘించడంతోనే పోలీసులు నోటీసులు ఇచ్చారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 52,500 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 57, 270.

తాజా వార్తలు