న్యూస్ రౌండప్ టాప్ 20 

1.కెసిఆర్ , మోది లపై రేవంత్ రెడ్డి కామెంట్స్

కెసిఆర్ , మోది లది కార్పొరేట్ ఫ్రెండ్లీ విధానమని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.

2.వైసీపీ పై నాదెండ్ల మనోహర్ విమర్శలు

ఏపీ సీఎం జగన్ తెనాలి పర్యటన సందర్భంగా జనసేన నాయకులను అరెస్టు చేయడం అప్రాజస్వామ్యకం అని,  ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్ట్ చేయాలని ఏ చట్టం చెబుతుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు.

3.వైసీపీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల ఇళ్లల్లో ఐటీ సోదాలు

వైసిపి ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబ సభ్యుల నివాసాలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

4.సుప్రీంకోర్టులో మనిష్ సిసోడియా పిటిషన్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తన అరెస్టును సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

5.బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఫ్లెక్సీ వార్

 భూపాలపల్లి లో  బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఫ్లెక్సీలు ఘర్షణ ముదిరింది .రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు.

6.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.నేటి ఏడు గంటల తరువాత దర్శనానికి వెళ్లే భక్తులకు 18 గంటల సమయం పడుతోంది.

7.గూగి రియల్ ఎస్టేట్ కంపెనీలో ఐటీ సోదాలు

Advertisement

హైదరాబాదులో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి.గూగి రియల్ ఎస్టేట్ కంపెనీలో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

8.లాలు రబ్రి దేవిలకు ఢిల్లీ కోర్టు సమన్లు

ఐఆర్సిటిసి కుంభకోణంలో నిందితులైన కేంద్ర రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ , అతని భార్య రబ్రీ దేవీలకు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది.

9.చంద్రబాబుతో ఎన్నారై టిడిపి నేతలు మీటింగ్

ఎన్నారై తెలుగుదేశం విక్టోరియా ప్రవాస నేతలు టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో వర్చువల్ సమావేశమయ్యారు.

10.సోము వీర్రాజును అడ్డుకున్న ఆప్ నేతలు

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనిష్ సిసోడియా అరెస్టుకు నిరసనగా తిరుపతిలో ఏపీ బీజేపీ  అధ్యక్షుడు సోము వీర్రాజును ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అడ్డుకున్నారు.

11.కరువుకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ : జగన్

కరువుకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని ఏపీ సీఎం జగన్ అన్నారు.గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్సార్ రైతు భరోసా నిధులను జగన్ విడుదల చేశారు.ఈ సందర్భంగా చంద్రబాబు తీరుపై జగన్ విమర్శలు చేశారు.

12.రాజాసింగ్ కు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనం

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్  బుల్లెట్ ప్రూఫ్ కారు పాడైందని, దానిని మార్చాలంటూ అనేక రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలోనే రాజా సింగ్ కు  మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది.

13.తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ ను జేఎన్టీయూహెచ్ విడుదల చేసింది.మార్చి 3 నుంచి 10 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

14.ఎస్సై పరీక్షల ఫలితాలు విడుదల

ఈనెల 19న నిర్వహించిన పరీక్షల ఫలితాలను ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఈ రోజు విడుదల చేసింది.

15.నేడు యాదాద్రి నరసింహుడి తిరుకల్యాణం

చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.నేడు స్వామివారికి తిరుకళ్యాణం జరగనుంది.

16.అమిత్ షా తో తెలంగాణ బిజెపి నేతలు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో నేడు తెలంగాణ బీజేపీ నేతలు బండి సంజయ్ డీకే అరుణ ఈటెల రాజేందర్ వివేక్ జితేందర్ రెడ్డి తదితరులు భేటీ అయ్యారు.

17.నేడు జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో.

Advertisement

గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జాతీయ మహిళా కమిషన్ ఏపీ మహిళా కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్యం మహిళల బాలికలకు సమానత్వం పై సదస్సు జరగనుంది.

18.రేపు నిడదవోలుకు జగన్

రేపు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు ఏపీ సీఎం జగన్ రానున్నారు.స్థానిక ఎమ్మెల్యే జిఎస్ నాయుడు కుమార్తె రిసెప్షన్ కు జగన్ హాజరవుతారు.

19.క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో జగన్ భేటీ

క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో ఏపీ సీఎం జగన్ సమావేశం నిర్వహించారు.రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి హాజరైన క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 51,450 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 56,120.

తాజా వార్తలు