న్యూస్ రౌండప్ టాప్ 20

1.రేవంత్ రెడ్డి పై వెంకట్ రెడ్డి విమర్శలు

కాంగ్రెస్సే రేవంత్ రెడ్డి.

రేవంత్ రెడ్డే కాంగ్రెస్ అని అనడం జోక్.నేను అయినా అలా అంటే తప్పే అవుతుంది అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెటైర్లు వేశారు.

2.ఈడీ పదవి కాలం పాడగింపు చట్ట విరుద్ధం

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్ సంజయ్ మిశ్రా పదవి కాలం పొడగింపు చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది.

3.అమరావతి రాజధాని కేసు

అమరావతి రాజధాని వ్యవహారంలో దాఖలైన పిటిషన్ లపై విచారణ ను సుప్రీంకోర్టు డిసెంబర్ కు వాయిదా వేసింది.

4.నారా లోకేష్ కామెంట్స్

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సీఎం జగన్ పెంచిన పనులన్నీ తగ్గిస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.

5.అంగన్వాడీల నిరసనలు

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ లు 36 గంటలుగా ఆందోళన లు కొనసాగిస్తున్నారు.

6.ఉచిత విద్యుత్ పై కేటీఆర్ కామెంట్

రైతులకు ఉచిత విద్యుత్ రద్దు చేయాలని కాంగ్రెస్ దుర్మార్గపు ఆలోచన చేస్తోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు.

7.ఏపీ ఎన్నికల కమిషనర్ కు కేంద్ర ఎన్నికల సంఘం పిలుపు

Advertisement

ఏపీ ఎన్నికల కమిషనర్ ఎంకే మీనాను కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీకి పిలిచింది.సీఈసీ పిలుపుతో ఆయన ఢిల్లీ చేరుకున్నారు.

8.రైతులకు కాంగ్రెస్ ప్రథమ శత్రువు

కాంగ్రెస్ నేతలకు ఇంట్లో 24 గంటల విద్యుత్ ఉండాలి గానీ, రైతులకు వద్దా అని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.రైతులకు కాంగ్రెస్ ప్రథమ శత్రువు అని ఆయన విమర్శించారు.

9.ముగియనున్న సింగరేణి మెడికల్ కాలేజీ దరఖాస్తు గడవు

రామగుండంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త మెడికల్ కాలేజీలో ఏడు సీట్ల కోసం సింగరేణి ఉద్యోగుల పిల్లలు ఈనెల 14 వ తేదీలోగా ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించాలని సింగరేణి యాజమాన్యం ప్రకటించింది.

10.పవన్ విమర్శలపై అంబటి రాయుడు కామెంట్స్

స్వచ్ఛందంగా సేవలందించే వాలంటీర్లను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంఘ విద్రోహ శక్తులతో పోల్చడాన్ని ప్రముఖ క్రికెట్ అంబటి రాయుడు తప్పుపట్టారు.

11.జేసీ కుటుంబం పై పెద్దారెడ్డి విమర్శలు

2024 లో చేసి కుటుంబానికి రాజకీయ సమాధి కట్టి చూపిస్తానని వైసిపి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు.

12.ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అల్లుడు కూతురు పై కేసు నమోదు

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూతురు తుల్జా భవాని రెడ్డి, అల్లుడు రాహుల్ రెడ్డి పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు అయింది.వీరిద్దరూ తన విధులకు ఆటంకం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని యాదగిరి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టులోను పిటిషన్ వేశారు.

13.తెలంగాణలో భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

14.పవన్ పై మల్లాది విష్ణు విమర్శలు

వలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్ కళ్యాణ్ కు లేదు అని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు.

15.ఆర్టీసీ బస్సు ప్రమాదం పై జగన్ దిగ్భ్రాంతి

ఆ సినిమాలో 100 మందితో ఫైట్ సీన్.. ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ సీన్ ఇదేనంటూ?
ఒకరోజు ముందుగానే పుష్ప2 విడుదల.. సంతోషంలో ఫ్యాన్స్!

ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో పొదిలి నుంచి కాకినాడకు పెళ్లి బృందంతో వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఎన్సిపి కాలువలో పడింది.ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందగా, 18 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.ఈ ఘటనపై ఏపీ సీఎం జగన్ విచారం వ్యక్తం చేశారు.

16.తిరుపతిలో కేరళ అసోం గవర్నర్ల పర్యటన

నేడు తిరుపతిలో కేరళ, అసోం గవర్నర్ లు పర్యటిస్తున్నారు.

17.పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం

Advertisement

నేడు దెందులూరు, ఉంగుటూరు నియోజకవర్గ కీలక నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం అవుతున్నారు.

18.ఏపీలో వర్షాలు పిడుగులు పడే అవకాశం

నైరుతి బంగాళాఖాతంపై ఉత్తర తమిళనాడు తీరం ఆనుకుని ఆవర్తనం కొనసాగుతోందని , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభక్తులు నిర్వహణ సంస్థ పేర్కొంది.ఈ ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని, వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

19.శ్రీవారి ఆలయంలో

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనాన్ని టిటిడి ఆగమోక్తంగా నిర్వహించింది.

20.పవన్ కళ్యాణ్ పై డిజిపి కి ఫిర్యాదు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన విమర్శలపై ఎస్సార్సీ సిపీ మహిళ విభాగం డిజిపి రాజేందర్ నాథ్ రెడ్డి ని కలిసి పవన్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

తాజా వార్తలు