న్యూస్ రౌండప్ టాప్ 20

1.పోడు రైతులకు హక్కు పత్రాలపై కెసిఆర్ కు లేఖ

పోడు రైతులకు హక్కు పత్రాల ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఎల్పీ నేత బట్టి విక్రమార్క సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.

2.రాష్ట్రపతికి లేఖ రాసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు బిఎస్పి తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లేఖ రాశారు.

3.శిక్ష తప్పదు అంటూ మావోయిస్టుల లేఖ

ఏటూరు నగరంలో మావోయిస్టు పార్టీ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.పలువురు అధికార పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేస్తూ లేఖ విడుదల చేశారు.

4.పదో తరగతి పరీక్షలు ప్రారంభం

పదో తరగతి పరీక్షలు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయి.

5.  గౌడ ఆత్మగౌరవ భవనం

త్వరలో గౌడ ఆత్మ గౌరవ భవనం తో పాటు, నీరా కేఫ్ ను ప్రారంభించనున్నట్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

6.  ఒంటరిగానే పోటీ : బండి సంజయ్

Advertisement

తెలంగాణలో సర్వేలు బిజెపికి అనుకూలంగా వస్తున్నాయని,  వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

7.ఓటీటీలు, ఈ కామర్స్ లకు నోటీసులు

ఆన్లైన్ లో దేశంలోని సగటు జనాభా డేటా అమ్మకానికి పెట్టిన కేసులో బ్యాంకులు, ఫైనాన్స్ , ఈ కామర్స్ సంస్థలు , ప్లాట్ ఫారాలకు సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

8.బి ఆర్ ఎస్ లో చేరికలు

మహారాష్ట్రకు చెందిన పలువురు ఎన్సిపి లోని మైనార్టీ నేతలు టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో హైదరాబాదులో పార్టీలో చేరారు.

9.పేపర్ లీకేజీ పై ఈడి కేసు నమోదు

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఈడి అధికారులు కేసు నమోదు చేశారు.

10.ప్రధానికి కేజ్రీ వాల్ లేఖ

భారత ప్రధాని నరేంద్ర మోదికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ లేఖ రాశారు.రైల్వే టికెట్ లలో వృద్ధులకు మినహాయింపు ఇవ్వాలని కేజ్రీవాల్ కోరారు.

11.ఢిల్లీలో పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లారు.అక్కడ కేంద్ర హోం మంత్రి అమిత్ షా,  బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను పవన్ కలవనున్నారు.

12.తెలంగాణ తొలి ప్రధాన న్యాయమూర్తి మృతి

తెలంగాణ హైకోర్టు తొలి న్యాయమూర్తిగా పనిచేసిన రిటైర్డ్  జడ్జి తొట్టతిల్  బి.రాధాకృష్ణన్ మృతి చెందారు.

13.సూరత్ కోర్టు కు రాహుల్

ప్రధాని నరేంద్ర మోది పై పరువు నష్టం కేసు దాఖలు చేసేందుకు గుజరాత్ లోని సూరత్ కోర్టు కు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ వెళ్లారు.

14.నేటి నుంచి ఒంటి పూట బడులు

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

నేటి నుంచి ఏపీలో ఒంటిపూట బడులు ప్రారంభం అయ్యాయి.

15.నేడు జగన్ కీలక సమావేశం

పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, నియోజకవర్గ ఇన్చార్జీలతో వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ నేడు తాడేపల్లిలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.

16.నేడు రౌండ్ టేబుల్ సమావేశం

Advertisement

నేడు ఉత్తరాంధ్ర బీసీ, ఎంబీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది.ఈ కార్యక్రమానికి టిడిపితో సహా మరికొన్ని పార్టీల నేతలు హాజరయ్యారు.

17.తిరుమల సమాచారం

ఈరోజు నుంచి మూడు రోజులు పాటు తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

18.నారా లోకేష్ పాదయాత్ర

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర నేటికి 59 వ రోజుకు చేరుకుంది.

19.ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

కడప జిల్లాలోని ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు నేటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి.నేటి ఉదయం కృష్ణా అలంకారం, రాత్రికి హనుమంత వాహనంపై స్వామి వారు దర్శనం ఇవ్వనున్నారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 54,700 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 59,670.

తాజా వార్తలు