టైలర్ తప్పుగా ప్రవర్తించాడు.. నాన్ననీ తండ్రిని కాదన్నాడు.. పల్సర్ ఝాన్సీ కష్టాలివే!

పల్సర్ బైక్ సాంగ్( Pulsar Bike Song ) ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న ఝాన్సీకి( Jhansi ) ప్రస్తుతం రియాలిటీ షోలలో, సినిమాలలో ఆఫర్లు వస్తున్నాయి.కెరీర్ పరంగా ఝాన్సీ అంతకంతకూ ఎదుగుతున్నారు.

 Pulsar Jhansi Career Troubles Details Here Goes Viral In Social Media ,pulsar Jh-TeluguStop.com

ఆర్టీసీ కండక్టర్( RTC Conductor ) గా పని చేస్తూనే స్టేజ్ షోల ద్వారా పాపులర్ అయిన ఝాన్సీ తన కెరీర్ పరంగా ఎదుర్కొన్న కన్నీటి కష్టాల గురించి చెప్పుకొచ్చారు.తాను ఓవర్ నైట్ స్టార్ అయ్యానని జనాలు అనుకుంటున్నారని ఆమె తెలిపారు.

అయితే తాను ఓవర్ నైట్ స్టార్ కావడం వెనుక 18 సంవత్సరాల కష్టం ఉందని ఆమె చెప్పుకొచ్చారు.తాను ఒకానొక సమయంలో టైలర్ షాపుకు వెళితే అక్కడ టైలర్ నాతో తప్పుగా ప్రవర్తించాడని కొలతలు తీసుకునే వంకతో మిస్ బిహేవ్ చేశాడని ఆమె అన్నారు.

మా నాన్నకు ఆ టైలర్ చేసిన పని గురించి చెప్పి కొట్టించాలని అనుకున్నానని అయితే నాన్నకు ఈ విషయం చెప్పిన తర్వాత నేను నీ తండ్రిని కాదు అని చెప్పమన్నాడని పల్సర్ ఝాన్సీ వెల్లడించారు.

తనకు ఎదురైన కన్నీటి కష్టాలను, చేదు అనుభవాల గురించి చెబుతూ ఝాన్సీ ఎమోషనల్ అయ్యారు.అయితే ఎన్నో ఏళ్ల ఝాన్సీ కష్టానికి ఇప్పుడిప్పుడే గుర్తింపు దక్కుతోందని సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుని ఆమె మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఆమె భర్త నుంచి కూడా ఝాన్సీకి ఎంతగానో సపోర్ట్ లభిస్తుండటం గమనార్హం.

కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నా ఝాన్సీ వాటిని పట్టించుకోకుండా ముందడుగులు వేస్తున్నారు.

పేద కుటుంబానికి చెందిన ఝాన్సీ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా స్థిరపడుతున్నారని సమాచారం అందుతోంది.ఝాన్సీ కెరీర్ ప్లానింగ్ విషయంలో జాగ్రత్త వహిస్తే ఆమె మరింత ఎదుగుతారని చెప్పవచ్చు.సెలబ్రిటీలు సైతం పలు సందర్భాల్లో పల్సర్ ఝాన్సీ గురించి పాజిటివ్ గా చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube