న్యూస్ రౌండప్ టాప్ 20

1.తెలంగాణ టిడిపి అధ్యక్షుడి నియామకం

తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు నర్సింహులును టిడిపి అధినేత చంద్రబాబు నియమించారు.

 

2.ఈ రోజు ఈటెల పాదయాత్ర

  మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ పాదయాత్ర నేడు హుజూరాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ మండలం బత్తినివానిపల్లె నుంచి ప్రారంభం అయ్యింది. 

3.లోక్ సభ స్పీకర్ కు రేవంత్ ఫిర్యాదు

  తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని హౌస్ అరెస్ట్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయమై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకుండా తనకు అడ్డుకున్నారని రేవంత్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

4.మజ్లిస్ పార్టీ ట్విట్టర్ ఖాతా హ్యక్

Advertisement

  మజ్లిస్ పార్టీ ట్విట్టర్ ఖాతా హ్యక్ అయ్యింది.దీంతో ఆ పార్టీలో కలకలం రేగింది. 

5.నల్లమలలో పెరిగిన చిరుతలు

  నల్లమల అటవీ ప్రాంతంలో చిరుత పులులు, వన్య ప్రాణుల సంఖ్య భారీగా పెరిగింది.చిరుత పులుల సంఖ్య 22 నుంచి 30 కి పెరిగినట్లు అటవీ అధికారులు తెలిపారు. 

6.పోలవరం చేరుకున్న జగన్

  ఏపీ సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా పోలవరం చేరుకున్నారు.దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికార్లు చేశారు. 

7.ఏపీలో దివ్యాంగుల సదరం క్యాంప్

  నేటి నుంచి ఏపీలో దివ్యాంగుల సదరం క్యాంప్ లను ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది.దరఖాస్తు చేసుకున్న 24 గంటలు పత్రాలను మంజూరు చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. 

8.భారత్ లో కరోనా

  గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 38,660 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

9.తిరుమల సమాచారం

  తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది.ఆదివారం తిరుమల స్వామి వారిని 17,264 మంది భక్తులు దర్శించుకున్నారు. 

10.నేటి నుంచి ప్రత్యేక ప్యాసింజర్ రైలు ప్రారంభం

  కోవేట్ కారణంగా ఏపీ రూట్ల లో నిలిచిపోయిన పలు ప్యాసింజర్ రైళ్లు తిరిగి ప్రారంభం అయ్యాయి. 

11.యూపీఎస్సీ పరీక్షలకు 31 శాతం హాజరు

  ఆదివారం తిరుపతి లో నిర్వహించిన యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీస్ ప్రవేశ పరీక్షలకు 1856 కు గాను కేవలం 587మంది మాత్రమే హాజరైనట్టు అధికార్లు తెలిపారు. 

12.జేఈఈ మూడో విడత పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ హెచ్చరిక..!!
వైట్ హౌస్ గేట్‌ను ఢీకొట్టిన వ్యక్తి.. కట్ చేస్తే మృతి..?

  జేఈఈ మూడో విడత పరీక్షలకు సర్వం సిద్దం అయ్యింది.కరోనా కారణంగా వాయిదా పడిన జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ సెషన్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. 

13.ఏపీ కి మరో సలహాదారు

  ఏపీ ప్రత్వానికి మరో సలహాదారుడు ని నియమించారు.రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖల సలహాదారు చల్లా మధుసూధన్ రెడ్డి ని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు గా నియమించారు. 

14.ఏపీలో కరోనా

  గడచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 2,974 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

15.  మరో మూడు రోజుల పాటు వర్షాలు

Advertisement

  తెలంగాణలో మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణం శాఖ అధికారులు తెలిపారు. 

16.3.27 లక్షల మందికి కాపు నేస్తం

  ఈ ఏడాది కాపు నేస్తం పథకం కింద 3.27 లక్షల మంది మహిళలను అర్హులుగా ఏపీ ప్రభుత్వం గుర్తించింది. 

17.శ్రీశైలం ఆలయ చైర్మన్ గా చక్రపాణి రెడ్డి

  ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం ఆలయ చైర్మన్ గా చక్రపాణి రెడ్డి ని ఏపీ ప్రభుత్వం నియమించింది. 

18.కేసీఆర్ కు శ్రావణ్ లేఖ

  తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏఐసీసీ సభ్యుడు సీనియర్ కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ లేఖ రాశారు.జిహెచ్ఎంసి ఎన్నికల ముందు వాగ్దానం చేసిన వరద సహాయం వెంటనే విడుదల చేయాలని కోరారు. 

19.సైకిల్ పై పార్లమెంట్ కు  తృణమూల్ ఎంపీలు

  పెట్రోల్ ధరలకు నిరసనగా తృణమూల్ ఎంపీలు  పార్లమెంటుకు సైకిల్ పై వచ్చి నిరసన తెలిపారు. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 45,000   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 49,090.

తాజా వార్తలు