న్యూస్ రౌండప్ టాప్ 20

1.వైసీపీ నేతలను విచారించిన సీబీఐ

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పదో రోజు విచారణ కొనసాగుతోంది.

కడప సెంట్రల్ జైల్ లో ముగ్గురు వైసీపీకి చెందిన అనుమానితులను సిబిఐ అధికారులు విచారించారు. 

2.టిఆర్ఎస్ ఎంపీ కి ఈడీ సమన్లు

  టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడి అధికారులు సమన్లు జారీ చేశారు.ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. 

3.ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన

  ప్రతి నెల జీతాల చెల్లింపు ఆలస్యం అవుతుండడం పై తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. 

4.ఈనెల 20 వరకు వేసవి సెలవులు

  ఈనెల 20వ తేదీ వరకు పాఠశాలలకు వేసవి సెలవులు కొనసాగుతాయని తెలంగాణ విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. 

5.ఈ ఏడాది హజ్ యాత్ర లేదు

  వరుసగా రెండో ఏడాది భారత్ నుంచి హజ్ యాత్ర రద్దు అయ్యింది.ఈ మేరకు భారత్ హజ్ కమిటీ ప్రకటన విడుదల చేసింది. 

6.వ్యవసాయ వెటర్నరీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

  వ్యవసాయ , వెటర్నరీ కోర్సుల కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ పాలిసెట్ సమన్వయకర్త రాజేశ్వరి తెలియజేశారు. 

7.తెలంగాణలో కరోనా

  గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 1556 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

8.క్షమాపణ చెప్పిన హైపర్ ఆది

  తెలంగాణ ప్రజలకు హైపర్ ఆది క్షమాపణలు చెప్పారు.జబర్దస్త్ లో ఓ స్కిట్ లో వాడిన డైలాగులు అభ్యంతరకరంగా ఉండడంపై ఉద్రిక్తత పరిస్థితులు ఎదురవడంతో ఆయన క్షమాపణలు చెప్పారు. 

9.జులైలో టెన్త్, ఇంటర్ పరీక్షలు

టెన్త్ , ఇంటర్ పరీక్షలను జూలై లో నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. 

10.జగన్ కు 7వ లేఖ రాసిన రఘురామ

  ఏపీ సీఎం జగన్ కు నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వరుసగా ఏడో రోజు లేఖను రాశారు.రైతుబంధు ఈ పథకం ప్రస్తుతం ఇస్తున్న పన్నెండు వేల ఐదు వందలు పాటు అదనంగా వెయ్యి, కేంద్రం ఇచ్చే ఆరువేల తో కలిపి 19,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

11.మిథున్ చక్రవర్తి ని ప్రశ్నించిన పోలీసులు

Advertisement

  బాలీవుడ్ నటుడు, ప్రముఖ బిజెపి నాయకుడు మిథున్ చక్రవర్తి ని కోల్కతా పోలీసులు వర్చువల్ విధానం ద్వారా విచారించారు.పశ్చిమబెంగాల్ ఎన్నికల సమయంలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఈ విచారణ జరిగింది. 

12.భారత్ లో కరోనా

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 62,224 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

13.రాష్ట్రవ్యాప్తంగా వైద్యుల నిరసన

  వైద్య విధుల్లో పాల్గొనే తమపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, ఈనెల 18న నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేయాలని జాతీయ వైద్యుల సంఘం నిర్ణయించిన నేపథ్యంలో తమిళనాడులోనూ ఈ నిరసన కార్యక్రమం నిర్వహించ తలపెట్టారు. 

14.ఈ నెల 17 వరకే కరోనా వ్యాక్సిన్

  తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ కొరత ఉన్న నేపథ్యంలో ఈ నెల 17 వరకు మాత్రమే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. 

15.ఆరు లక్షలు దాటిన కోవిడ్ మరణాలు

  అమెరికాలో కోవిడ్ మరణాల సంఖ్య ఆరు లక్షలు దాటింది. 

16.బంగారానికి హాల్ మార్క్ తప్పనిసరి

  బంగారానికి హాల్ మార్క్ తప్పనిసరి చేస్తూ ఇచ్చిన గడువు ముగియడంతో ఇకపై బంగారానికి హాల్ మార్క్ తప్పనిసరి. 

17.ఇంటర్ ఫలితాల వెల్లడికి కసరత్తు

  తెలంగాణలో ఇంటర్ పరీక్ష ఫలితాలను అతి త్వరలో విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోంది. 

18.ఎడ్ సెట్ ల దరఖాస్తు గడువు పెంపు

  ఎడ్ సెట్ దరఖాస్తుల గడువు ఈ నెల 22 వరకూ తెలంగాణలో పొడిగించారు. 

19.ఏపీలో కరోనా

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

  గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 5,741 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,410   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 48,410.   .

Advertisement

తాజా వార్తలు