న్యూస్ రౌండప్ టాప్ 20

1.వైద్య ఆరోగ్య శాఖకు బదిలీల గడువు పెంపు

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల బదిలీల గడువును ప్రభుత్వం పొడిగించింది.

మార్చి 30వ తేదీ వరకు ఈ గడువును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

2.టీటీడీ లో వి .ఐ.పి బ్రేక్ దర్శనాలు రద్దు

సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యత పెంచే విధంగా వీకెండ్ లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది.

3.విద్యార్థుల కోసం టోల్ ఫ్రీ నెంబర్

ఏపీ విద్యుత్ శాఖ నిర్ణయం తీసుకుంది పాఠశాలల్లో అమలు చేస్తున్న పథకాలు కార్యక్రమాల పై అభిప్రాయాలు ,ఫిర్యాదులు స్వీకరించేందుకు 14417 అనే టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేసింది.

4.అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రం నేడు ప్రారంభం

తెలంగాణలోని రాజేందర్ నగర్ లో ఏడు వేల కోట్ల వ్యయంతో నిర్మించిన తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రాన్ని నేడు మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభిస్తారు.

5.నేడు ఢిల్లీకి కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ఢిల్లీకి వెళ్తున్నారు.రాష్ట్రపతి ఎన్నికలే ముఖ్య అజెండాగా ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు.

6.కార్యకర్తలతో జగ్గారెడ్డి సమావేశం

ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలతో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు.

7.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 311 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

8.శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలం క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగు తున్నాయి.

9.బయో ఆసియా సదస్సు

బయో ఆసియా 2022 అంతర్జాతీయ సదస్సులో మంత్రి కేటీఆర్ ప్రపంచ టెక్ దిగ్గజం , మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక అధినేత బిల్ గేట్స్ తో వర్చువల్ గా సమావేశమయ్యారు.

10.ఉక్రెయిన్ లో తెలుగు విద్యార్థులు క్షేమం

Advertisement

ఉక్రెయిన్ లో ఉన్న కొందరు విద్యార్థులతో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడారు.ఉక్రెయిన్ లో ఉన్న తెలుగు విద్యార్థులు క్షేమంగా ఉన్నారని తల్లిదండ్రులు ఎవరు ఆందోళన చెందవద్దు అని మంత్రి ధైర్యం చెప్పారు.

11.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 14,148 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

12.కడప నుంచి 5 నగరాలకు ఇండిగో సేవలు

ఆంధ్రప్రదేశ్ లోని కడప నుంచి ఐదు నగరాలకు ఇండిగో విమానయాన సంస్థ సర్వీసులు నడపనుంది.మార్చి 27 నుంచి చెన్నై ,విజయవాడ ,హైదరాబాద్, మార్చి 29 నుంచి విశాఖపట్నం ,బెంగళూరు లకు సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

13.బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఉద్యోగాలు

ముంబైలోని బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఒప్పంద రెగ్యులర్ విధానంలో వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.మొత్తం 42 ఖాళీలు ఉన్నాయి.

14.బెల్ లో ప్రాజెక్ట్ ట్రైనీ ఇంజనీర్

భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన పూణేలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఎలక్ట్రానిక్స్ల్ మెకానికల్ సివిల్ , ఎలక్ట్రికల్ విభాగాలలో ఖాళీల భర్తీకి స్పెషల్ విడుదల చేసింది.దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 16.

16.మార్చి 26 నుంచి ఐపీఎల్ -15

ఐపీఎల్ -15 సీజన్ షెడ్యూల్ ఖరారైంది.బ్రాడ్ కాస్టర్స్ విజ్ఞప్తి మేరకు మార్చి 26 నుంచి ప్రారంభించేందుకు బిసిసిఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

17.నాంపల్లి ఎగ్జిబిషన్ నేటి నుంచే

నాంపల్లి నుమాయిష్ తిరిగి ఈ రోజు ప్రారంభం కానుంది.

18.అమరావతి రైతు దీక్షకు జనసేన మద్దతు

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
బన్నీని ఆ రిక్వెస్ట్ చేసిన డేవిడ్ వార్నర్... ఓకే చెప్పిన అల్లు అర్జున్?

రాజధాని కోసం రైతులు చేపట్టిన దీక్షకు జనసేన మద్దతు ప్రకటించింది.

19.పోలీసులకు కృతజ్ఞతలు చెప్పిన పవన్ కళ్యాణ్

వేముల నాయక్ ఫ్రీ రిలీజ్ కార్యక్రమం నిర్వహణకు సహకరించిన తెలంగాణ పోలీస్ యంత్రాంగానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృత జ్ఞతలు తెలియజేశారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,850

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 51,110

Advertisement
" autoplay>

తాజా వార్తలు