న్యూస్ రౌండప్ టాప్ 20

1.అంతర్జాతీయ చెస్ పోటీల్లో నల్గొండకు స్థానం

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

అంతర్జాతీయ పోటీలలో నల్గొండ జిల్లాకు నాలుగో స్థానం దక్కింది.

స్పెయిన్ లో జరిగిన చెస్ పోటీలలో 28 దేశాలు పాల్గొన్నాయి. 

2.అఖిలపక్ష నాయకుల ముందస్తు అరెస్ట్

  కామారెడ్డిలో కొత్త మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా కొనసాగుతోంది.బంద్ సందర్భంగా అఖిలపక్ష నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. 

3.24న పలు రైళ్లు పాక్షిక రద్దు

 

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

రైలు మార్గంలో మరమ్మతులు కారణంగా ఈనెల 24వ తేదీ చెన్నై సెంట్రల్ కు రావలసిన కొన్ని రైళ్ళను ముందస్తుగా రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. 

4.మాదాపూర్ లో వీసా దరఖాస్తు కేంద్రం

  వేసా దరఖాస్తు కేంద్రం చిరునామా మారిందని హైదరాబాదులోని అమెరికన్ కౌన్సిలేట్ జనరల్ కార్యాలయం తెలిపింది.వీసా దరఖాస్తుదారులు ఈనెల 8 నుంచి హైదరాబాద్ మాదాపూర్ లోని హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ లోయర్ కాన్ కోర్స్ లో కొత్త వీసా దరఖాస్తు కేంద్రాన్ని సందర్శించాలని కాన్సులేట్ జనరల్ కార్యాలయం తెలిపింది. 

5.కామారెడ్డి బంద్ కు కాంగ్రెస్ మద్దతు

 

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

కామారెడ్డి బందు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. 

6.తిరుమల సమాచారం

 తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.గురువారం తిరుమల శ్రీవారిని 47,781 మంది భక్తులు దర్శించుకున్నారు. 

7.కోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్

 

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold
Advertisement

హైకోర్టు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల పరిధిలో చేపట్టే వివిధ పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ క్యాలెండర్ తెలంగాణ హైకోర్టు రిజిస్టర్ జనరల్ విడుదల చేశారు.అన్ని స్థాయిల్లోనూ దాదాపు 1904 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. 

8.వాల్తేరు వీరయ్య ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పనులకు బ్రేక్

   చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించి ఈనెల ఎనిమిదో తేదీన విశాఖపట్నంలో నిర్వహించ తలపెట్టిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పనులను పోలీసులు నిలిపివేయించారు. 

9.నేడు ఒంగోలులో వీర సింహారెడ్డి ఫ్రీ రిలీజ్ వేడుక

 

హీరో బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి చిత్రం ఫ్రీ రిలీజ్ వేడుకకు ఒంగోలు సర్వం సిద్ధమైంది.మొత్తం ఎనిమిది వేల మంది కూర్చుని చూసేందుకు ఏర్పాట్లు చేశారు. 

10.పోలవరం ముంపు 13న భేటీ

  పోలవరం బ్యాక్ వాటర్ ముంపు పై ఈనెల 13న ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో సాంకేతిక కమిటీ భేటీ జరగనుంది. 

11.త్వరలో ఏపీ మూడు ముక్కలు : ఏబి వెంకటేశ్వరావు

 

ఆంధ్రప్రదేశ్ మరో మూడు ముక్కలు అవ్వడానికి సిద్ధంగా ఉందని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

12.ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నేడు విచారణ

  ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు సిబిఐతో దర్యాప్తు చేయించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది .నేటి మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి విచారణ చేపట్టనుంది. 

13.ఏపీ సలహాదారుల నియామకంపై హైకోర్టు ఆగ్రహం

 

ఏపీలో సలహాదారుల నియామకాన్ని హైకోర్టు తప్పు పట్టింది.ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో కలెక్టర్లు , పోలీస్ కమిషనర్లు , తాసిల్దార్ లకు కూడా సలహాదారులను నియమిస్తారా అంటూ ప్రభుత్వం ప్రశ్నించింది. 

14.విశాఖలో గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్

  నేటి నుంచి విశాఖ గ్లోబల్ హెల్త్ కేర్ జరగనుంది.వైద్యులతో వర్చువల్ గా ఏపీ సీఎం జగన్ ప్రసంగించనున్నారు. 

15.వ్యవసాయ శాఖపై జగన్ సమీక్ష

 

'రుద్ర' గా ప్రభాస్ కొత్త పోస్టర్ వైరల్!
కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?

నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. 

16.నేటి నుంచి ఆర్గానిక్ మేళ

  నేటి నుంచి మూడు రోజులపాటు విశాఖలో ఆర్గానిక్ జరగనుంది.సేంద్రియ రైతులు,  వ్యవసాయ శాస్త్రవేత్తలతో సదస్సులు నిర్వహించనున్నారు. 

17.నేడు కామారెడ్డి బంద్ కు రైతు జేఏసీ పిలుపు

 

Advertisement

 నేడు కామారెడ్డి బందుకు రైతు జేఏసీ పిలుపునిచ్చింది.మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా కామారెడ్డిలో రైతులు ధర్నా చేపట్టారు.బంద్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. 

18.కామారెడ్డి ఆందోళనకు బిజెపి మద్దతు

  నేడు కామారెడ్డి లో రైతులు చేపట్టనున్న ఆందోళనలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొనున్నారు.బంద్ కు బిజెపి మద్దతు ప్రకటించింది. 

19.విద్యార్థుల కు ఇచ్చిన ట్యాబ్ లపై జగన్ సమీక్ష

 

రాష్ట్ర వ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన టాబ్ లలో ఎలాంటి సమస్య తెలెత్తిన,  వారం రోజుల్లో మరమ్మత్తు చేసి ఇవ్వాలని లేదా కొత్త ట్యాబ్ ను అందజేయాలని సీఎం జగన్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 50,900   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 55,530.

తాజా వార్తలు