ముఖంపై ఎలాంటి మచ్చలు ఉన్న ఈ ఒక్క రెమెడీతో పోగొట్టుకోవచ్చు.. తెలుసా?

మొటిమలు, ఎండల ప్రభావం, హార్మోన్ల అసమతుల్యత, పిగ్మెంటేషన్ తదితర కారణాల వల్ల ముఖంపై నలుపు లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతుంటాయి.

ఇవి ముఖ‌ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బ తిస్తాయి.

ఈ క్రమంలోనే మార్కెట్లో లభ్యమయ్యే క్రీమ్స్ ను కొనుగోలు చేసి వాడుతుంటారు.అయితే ఆ క్రీమ్స్ లో ఎన్నో రసాయనాలు నిండి ఉంటాయి.

అవి చర్మ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి.అందుకే కెమికల్స్ తో నిండి ఉండే క్రీమ్స్ ను వాడటం బదులుగా ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ సూపర్ పవర్ ఫుల్ హోమ్ రెమెడీని పాటిస్తే చాలా సులభంగా మరియు సహజంగా మచ్చలను నివారించుకోవచ్చు.

ముఖంపై ఎలాంటి మచ్చలు( Blemishes ) ఉన్నా సరే ఈ ఒక్క రెమెడీ తోనే పోగొట్టుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో నాలుగు నుంచి ఆరు లవంగాలు( Clove ), రెండు అనాస పువ్వులు వేసి కనీసం ప‌దిహేను నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి( Sandalwood Powder ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకుని కలుపుకోవాలి.చివరిగా సరిపడా తయారు చేసుకున్న వాటర్ ను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే కనుక ముఖ చర్మం పై ఎలాంటి మచ్చలు ఉన్నా సరే క్రమంగా మాయం అవుతాయి.క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

Advertisement

పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల మొటిమల నుంచి విముక్తి లభిస్తుంది.చర్మం ప్రకాశవంతంగా, బిగుతుగా సైతం మారుతుంది.

తాజా వార్తలు