అనుష్క డైరెక్టర్ తో సినిమా చేయనున్న సూర్య...

సూర్య ( surya )హీరో గా నటించిన చాలా సినిమాలు తెలుగులో మంచి విజయాలను అందుకున్నాయి.

ఇక ఈయన ప్రస్తుతం శివ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు ఇది అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా విషయాన్ని పక్కన పెడితే సూర్య గజిని సినిమాతో తెలుగు లో బాగా పాపులర్ అయ్యాడు.ఇక అప్పటి నుంచి కూడా తెలుగు లో ఒక మంచి సినిమా చేయాలని చూస్తున్నాడు కానీ అది ఇంకా ఇప్పటి వరకు కూడా కుదరలేదు.

కారణం ఆయనకి తెలుగు డైరెక్టర్లు చెప్పిన కథలు నచ్చడం లేదట.నిజానికి అప్పట్లో త్రివిక్రమ్( Trivikram ) సూర్య కాంబో లో ఒక సినిమా రావాల్సింది కానీ ఈ సినిమా అనుకోకుండా కుదరలేదు.

ఇక అప్పటి నుంచి కూడా చాలా మంది డైరెక్టర్లు కథలు చెప్పారట కానీ అవి సూర్య కి నచ్చకపోవడంతో ఆ సినిమా లు చేయకుండా వదిలేసాడట.అందుకే సూర్య కి స్టోరీ నచ్చాలంటే అది సూపర్ గా ఉండాలి అని చాలా మంది అంటూ ఉంటారు.ఇక ఇప్పుడు సూర్య కి ఒక తెలుగు డైరెక్టర్ చెప్పిన కథ బాగా నచ్చిందట ఆ డైరెక్టర్ ఎవరంటే తెలుగులో పిల్ల జమీందారు, భాగమతి సినిమాలు తీసిన డైరెక్టర్ అయిన అశోక్ చెప్పిన కథ సూర్య కి బాగా నచ్చడంతో సూర్య ఆయనతో సినిమా చేస్తాను అని చెప్పాడట.

Advertisement

ఇక ఇప్పుడు అశోక్( Ashok ) అదే పనిలో ఉన్నట్టు గా తెలుస్తుంది.నిజానికి మనం అశోక్ సినిమాలను గమనిస్తే ఈయన తీసే సినిమా స్టోరీలలో ఒక మంచి పాయింట్ ఉంటుంది అనేది చాలా స్పష్టం గా తెలుస్తుంది.అందుకే ఈయన చేసిన సినిమాల గురించి తెలుసుకొని మరి సూర్య ఆ సినిమాలు చూసి ఈయనకి ఛాన్స్ ఇచ్చినట్టు గా తెలుస్తుంది.

అశోక్, సూర్య కాంబో లో సినిమా తొందర గా స్టార్ట్ అయి షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ అయి సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం.

Advertisement

తాజా వార్తలు