హీరో నానికి గండం.. 108 రోజులు బయటకు రాకూడదట!

టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని తాజాగా నటించిన చిత్రం అంటే సుందరానికి.ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో హీరో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రీమా నజీమ్ హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటికే నాని అభిమానులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

అంతే కాకుండా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇకపోతే నేడు నాని పుట్టినరోజు.

ఈ సందర్భంగా అంటే సుందరానికి చిత్రబృందం నానికి ముందస్తుగానే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నాని నటిస్తున్న తాజా చిత్రం నుంచి చిన్న గ్లింప్స్ ని విడుదల చేసింది.ఈ సినిమాలో నాని ఒక అమాయకపు బ్రాహ్మణుడి గా కనిపించ బోతున్నాడు.

Advertisement

ఇక అందులో నా నిజజీవితంలో అన్ని గండాలు ఉన్నందువల్ల అతని కుటుంబ సభ్యులు ఎక్కువగా హోమాలు చేయిస్తూ ఉంటారు.ఇక వరుస హోమాలతో విసుగెత్తిపోయిన నాని బయటకు వెళ్తే ద్విచక్ర వాహన గండం, లీగల్ లోకి వెళితే జలగండం, నడిస్తే రోడ్డు గండం, కూర్చుంటే కుర్చీ గండం.

దీనమ్మ గండం అంటూ ఫ్యామిలీ పై ఫైర్ అవుతాడు నాని.తాజాగా విడుదల చేసిన ఆ వీడియోలో.

ఆ వాడి జాతక ప్రకారం బర్తడే హోమం జరిగిన 108 రోజుల వరకూ బయటకు రాకూడదు అని అన్నారు.అందుకే జూన్ 10న మిమ్మల్ని నవ్వించడానికి థియేటర్ కి వస్తున్నాం అంటూ చిత్ర బృందం సినిమా నుంచి చిన్న గ్లింప్స్ వీడియోనీ విడుదల చేసింది.

ఇకపోతే ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ హెచ్చరిక..!!
10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఇక తాజాగా విడుదల చేసిన ఈ వీడియోతో అంచనాలు మరింత పెరిగాయి.

Advertisement

ఇక నాని అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు