నేరల నియంత్రణే లక్ష్యంగా జిల్లా పోలీసుల మరో అడుగు

జిల్లాలో ఇంటర్‌సెప్టర్ పోలీస్ వాహనాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ధర్నాలు,రాస్తారోకోలు జరిగే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన ఆ సంఘటనలను రికార్డు చేసే అధునాతన టెక్నాలజీ రాజన్న సిరిసిల్ల జిల్లా:నేరాల నియంత్రణనే ప్రధాన ఉద్దేశ్యంతో ప్రజల్లో పోలీసు వ్యవస్థ పట్ల గౌరవం నమ్మకం మరింత పెరిగేలా జిల్లాలో మొట్టమొదటగా ఇంటర్‌సెప్టర్ పోలీస్ వాహనాన్ని ప్రారంభించామని, ఈ ఇంటర్‌సెప్టర్ పోలీస్ వాహనం సిరిసిల్ల టౌన్, వేములవాడ టౌన్ లో నిత్యం తిరుగుతూ ర్యాలీలు, ధర్నాలు, అల్లర్లు జరిగినప్పుడు ఈ వాహనానికి ఉన్న 360°గలా కేమెరా తో రికార్డ్ చేసి ఉన్నత అధికారులకు తెలియజేస్తారు అన్నారు.

ఇద్దరు డ్రిస్టిక్ గార్డ్ సిబ్బందితో ఉన్న ఈ వాహనం సిరిసిల్ల, వేములవాడ పట్టణంలో ప్రధాన కూడళ్లలో నిత్యం తిరుగుతూ శాంతి భద్రతలు పర్యవేక్షిస్తారు అని జిల్లా ఎస్పీ అన్నారు.

ఎస్పీ వెంట ఆర్.ఐ రజినీకాంత్, టౌన్ సి.ఐ అనిల్ కుమార్ సిబ్బంది ఉన్నారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు

Latest Rajanna Sircilla News