అనుష్క కాదు అంజలి

యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయాపాటి శ్రీను దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం సరైనోడు.

ఇందులో అల్లు అర్జున్ కి జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా, మరో కథానాయిక పాత్రలో కేథరిన్ కనిపించనుంది.

అయితే ఐటెం సాంగ్ కోసమని అనుష్కని సంప్రదించారని, ఇందులో ఉండే ఆ హాట్ హాట్ సాంగ్ కి అల్లు అర్జున్ తో అనుష్క స్టెప్స్ వేస్తుందని వార్తలు వచ్చాయి.ఒక గుప్త వార్తదాత మాట్లాడుతూ " ఐటెం సాంగ్ కోసమని అసలు అనుష్క ని ఎవరు సంప్రదించలేదు.

ఈ వదంతు మీడియాలో ఎలా వచ్చిందో తెలియదు.ఇందులో అనుష్క ఎలాంటి పాత్రలో కనిపించదు.

స్పెషల్ సాంగ్ కోసమని ప్రస్తుతం అంజలితో చర్చలు జరుగుతున్నాయి.అన్ని అనుకున్నట్టే జరిగితే అంజలి ఐటెం సాంగ్ లో మెరుస్తుంది.

Advertisement

శంకరాభరణంలో అంజలి రశేష్ చూసిన యూనిట్, ఈ సాంగ్ అంజలి అయితే బాగుంటుందని భావిస్తోంది" అంటూ వార్తను ఇటు చేరివేసారు.గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రం యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

డిసెంబర్ ఆఖర్లో లేదా జనవరి మాసంలో షూటింగ్ మొత్తం పూర్తీ చేసి ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు