జంతువును చంపి వాటి అవయవాల స్మగ్లింగ్.. అరెస్ట్..!

అరుదైన అడవి జంతువులను చంపి స్మగ్గింగ్ కి పాల్పడుతున్న దుండగులను అటవిశాఖ అధికారులు అరెస్ట్ చేశారు.

అటవి ప్రాంతాల్లో నివసించే కొందరు దుండగులు లాభం కోసం జంతువులను చంపి వాటి అవయవాలను మార్కెట్ లో అమ్ముతు క్యాష్ చేసుకుంటున్నారు.

అడవి జంతువుల మాంసంతో పాటు వీటి తోలు, చర్మం, దంతాలకు బాగా డిమాండ్.రాష్ట్రాల్లోనే కాదు దేశంలో కూడా స్మగ్లింగ్ పెరిగిపోతుంది.

తాజాగా అలుగు (మంగోలిన్) జీవి చర్మాన్ని స్మగ్లింగ్ చేస్తున్న 12 మంది దుండగులకు అటవి శాఖ అధికారులు పట్టుకున్నారు.హైదరాబాద్ తో సహా కొత్తగూడెం, భద్రాచలం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లలో అధికారులు వన్యప్రాణుల రక్షణకై, స్మగ్లింగ్ కు పాల్పడుతున్న వారిని పట్టుకోవడానికి ఆపరేషన్ నిర్వహించారు.

భద్రాచలం అడవుల్లో నివసించే ఆదివాసులు అలుగు చర్మాన్ని అమ్ముతారని తెలిసి మారువేశంలో వెళ్లి దాడి చేశారు.మొదటగా అధికారులు బాదావత్ రవి అనే వ్యక్తిని అదుపులో తీసుకుని విచారించి మిగిలిన వివరాలు సేకరించారు.

Advertisement

నిఘా పెట్టి 12 మందిని పట్టుకున్నారు.వీరి నుంచి సుమారు నాలుగు కేజీల పొలుసులను స్వాధీనం చేసుకున్నారు.

దీని కోసం మూడు నుంచి ఐదు అలుగు జంతువులను చంపినట్లు పోలీసులు తెలిపారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.

Advertisement

తాజా వార్తలు