హిందీలోకి వెళ్తున్న సంక్రాంతికి వస్తున్నాం... హీరో అతనేనా?

సంక్రాంతి పండుగ సందర్భంగా విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki  Vastunnam ) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీ విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ అద్భుతమైన కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతుంది.

ఇప్పటికే సుమారు 260 కోట్ల కలెక్షన్లను సాధించి దూసుకుపోతున్న ఈ సినిమా త్వరలోనే 300 కోట్ల క్లబ్ లోకి చేరబోతుందని తెలుస్తుంది.ఇక వెంకటేష్ సినీ కెరియర్ లో ఈ చిత్రం అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డులు సాధించింది.

ఇక ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు నటి ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) నటించారు.ఈ సినిమా హిట్ కావడంతో వీరి క్రేజ్ మరింత పెరిగిపోయింది.

ఇక ఈ సినిమా గురించి ఇటీవల డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ సినిమాని హిందీలో చేసే ఆలోచనలో ఉన్నారని స్పష్టమవుతుంది.

Anil Ravipudi Very Interested To Bollywood Remake Of Sankranthiki Vastunnam, San
Advertisement
Anil Ravipudi Very Interested To Bollywood Remake Of Sankranthiki Vastunnam, San

ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా ఇదే విషయం గురించి అనిల్ రావిపుడికి  ప్రశ్నలు ఎదురవడంతో తనకు ఈ సినిమాని హిందీలోకి తీసుకువెళ్లాలనే ఆలోచన ఉందని తెలిపారు.అయితే అందులో హీరోగా ఎవరో నటిస్తే బాగుంటుందనే ప్రశ్న కూడా ఎదురు కావడంతో ఈ కథ నటుడు షారుఖ్ ఖాన్ (Sharukh Khan) గారికి సరిగా సూట్ అవుతుంది అంటూ అనిల్ రావిపూడి చెప్పినట్టు తెలుస్తుంది.మరి ఈ సినిమా హిందీ రీమేక్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

వెంకీ అట్లూరి బాటలోనే నడుస్తున్న అజయ్ భూపతి...
Advertisement

తాజా వార్తలు