పురాతన పంచలోహ అమ్మవారి విగ్రహం లభ్యం.. ఎక్కడంటే..?

మన భారతదేశంలో ఎన్నో పురాతన దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.అంతేకాకుండా మన దేశంలో అప్పుడప్పుడు జరిపే తవ్వకాలలో కొన్ని పురాతన విగ్రహాలు కూడా బయటపడుతూ ఉంటాయి.

తాజాగా లాల్గుడి సమీపంలో తవ్వకాలు జరుపుతుండగా పురాతన పంచలోహ అమ్మవారి విగ్రహం లభ్యమైంది.నన్ని మంగళం గ్రామంలోని అగ్రహారం వీధుల్లో పెరుమాళ్ దేవాలయానికి చెందిన స్థలంలో ఆదివారం కొత్త బోరు బావి కోసం కార్మికులు తవ్వకాలు మొదలుపెట్టారు.

అప్పుడు 20 అడుగుల లోతులో ఆరడుగుల ఎత్తున పురాతన పంచలోహ అమ్మవారి విగ్రహాన్ని గుర్తించి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు.ఆ తర్వాత గ్రామ పరిపాలన అధికారులు గుణశేఖరన్, పోలీసులు అక్కడికి వెళ్లి విగ్రహాన్ని స్వాధీనం చేసుకొని, తహసిల్దార్ కార్యాలయానికి తరలించారు.

అక్కడి నుంచి ఖజానా అధికారులు ఈ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

అంతే కాకుండా పుష్పగిరి క్షేత్రంలో 12వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలం నాటి దేవాలయం బయట పడింది.వై ఎస్ ఆర్ జిల్లాలోని దక్షిణ కాశీగా పేరు ఉన్న పుష్పగిరిలో వందల దేవాలయాలు ఉన్నాయి.కానీ అక్కడ పుష్పాచలేశ్వర దేవాలయం ఉన్నట్లు చాలామందికి తెలియదు.

ముఖ్యంగా చెప్పాలంటే కొండ పై ఈశాన్యం లో ఈ దేవాలయాన్ని కాకతీయ వాస్తు, నిర్మాణ శైలితో అప్పటి రాజులు తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

గుప్త నిధుల కోసం ఈ దేవాలయాన్ని ధ్వంసం చేయడంతో నేడు శిథిలావస్థకు చేరుకుని ఉంది.దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేస్తే, ప్రస్తుతం తలపెట్టిన గిరి ప్రదక్షిణకు మరింత విశిష్టత చేకూరుతుందని చరిత్రకారుడు తవ్వా ఓబుల్ రెడ్డి వెల్లడించారు.ప్రస్తుతం మన దేశంలో ఇలా శిథిలావస్థకు చేరుకున్న దేవాలయాలు చాలానే ఉన్నాయి.

హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!
Advertisement

తాజా వార్తలు