అలాంటివి నాకు కామన్ అంటున్న విష్ణుప్రియ..!

బుల్లితెర స్టార్ యాంకర్ విష్ణుప్రియ ఒకవైపు పోవేపోరా షో ద్వారా బుల్లితెరపై సత్తా చాటుతూ మరోవైపు చెక్ మేట్ అనే సినిమా ద్వారా వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఈ సినిమా హిట్టైతే తెలుగులో మరిన్ని అవకాశాలు సంపాదించుకోవచ్చని విష్ణుప్రియ భావిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో విరిగిగా పాల్గొంటున్న విష్ణుప్రియ ఇన్స్టాగ్రాం ఖాతా వెరిఫై కావడం గురించి మాట్లాడుతూ ఒక పోస్ట్ ను పెట్టారు.చాలాసార్లు తాను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను వెరిఫైచేసుకునేందుకు ప్రయత్నించానని అయితే ప్రతిసారి రిజెక్ట్ అయిందని ఆమె పేర్కొన్నారు.

తిరస్కరణలు తనకు కొత్తేం కాదని అయితే తిరస్కరణకు గురైన ప్రతిసారి తాను మరింత పాజిటివ్ అవుతానని విష్ణుప్రియ తెలిపారు.గతంలో రిజెక్ట్ అయితే బాధగా అనిపించేదని.

ఆ తరువాత బాధ పడటం కూడా మానేశానని విష్ణుప్రియ చెప్పుకొచ్చారు.తిరస్కరణలకు గురి కావడం తనకు కామన్ అయిందని విష్ణుప్రియ అన్నారు.

Advertisement

తిరస్కరణలు తనను ఎలాంటి సమయంలోనైనా ఒకే విధంగా ఉండేలా సిద్ధం చేశాయని.తిరస్కరణలకు గురైతే బాధ పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

చాలామంది అభిమానులు తన ఇన్స్టాగ్రామ్ పేజ్ వెరిఫై కావాలని కోరుకున్నారని.ఎట్టకేలకు పేజ్ వెరిఫై అయిందని ఆమె అన్నారు.

తిరస్కరణల గురించి విష్ణుప్రియ చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.చిన్నప్పటి నుంచి నటనపై ఎంతో ఇష్టం ఉన్న విష్ణుప్రియ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ ను ప్రారంభించి ఆ తరువాత యాంకర్ గా చెక్ మేట్ సినిమాలో హీరోయిన్ గా చేసి ఎట్టకేలకు నటి కావాలనుకున్న కోరికను నెరవేర్చుకున్నారు.

త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.ఇప్పటికే చెక్ మేట్ సినిమా ట్రైలర్ విడుదల కాగా ప్రేక్షకుల నుంచి ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?
Advertisement

తాజా వార్తలు