కొడుకు రోషన్ ని లైవ్ లో చీపురు కట్టతో చితకబాదిన యాంకర్ సుమ!

యాంకరింగ్ రంగం లో దిగ్గజం, సుమారుగా రెండు దశాబ్దాల ఆడియన్స్ ని అలరిస్తూ, ఇప్పటికీ మంచి డిమాండ్ ఉన్న యాంకర్ ఎవరు అని అడిగితే అది సుమ( Anchor Suma ) అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అలాగే క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో వందల సినిమాల్లో నటించి, ఇప్పటికీ బిజీ గా గడుపుతున్న నటుడు రాజీవ్ కనకాల.

వీళ్లిద్దరు కుమారుడుగా రోషన్ బాబు రీసెంట్ గా బబుల్ గమ్( Bubblegum ) అనే సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చాడు.సినిమా బాగుంది అనే టాక్ వచ్చినప్పటికీ కూడా ఎందుకో కమర్షియల్ గా వసూళ్లను మాత్రం రాబట్టలేకపోతుంది.

సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ, ప్రమోషన్స్ విషయం లో మాత్రం సుమ ని, రోషన్ ని మరియు మూవీ టీం ని మెచ్చుకోవాల్సిందే.మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియా దగ్గర నుండి సోషల్ మీడియా వరకు వీళ్ళ ప్రొమోషన్స్ వేరే లెవెల్ అని చెప్పాలి.

Anchor Suma Crushed His Son Roshan Live With A Broom , Anchor Suma , Bubblegum

అసలు ఈ సినిమా మీద ఆసక్తి లేని వాళ్లకు కూడా, ఏందీ వీళ్ళ టార్చర్, ఊరికే టీవీ లో కనిపిస్తున్నారు, ఒకసారి ఎలా చేసాడో సినిమా చూసి తేల్చేద్దాం అని థియేటర్స్ కి కదిలిన వాళ్ళు కూడా ఉన్నారు.అందుకే వీళ్ళ ప్రొమోషన్స్ కష్టానికి ఎవ్వరైనా చప్పట్లు కొట్టాల్సిందే.చిన్న సినిమా నిర్మాతలు ఈ స్ట్రాటజీ ని అనుసరిస్తే సినిమాకి కనీస స్థాయిలో అయినా వసూళ్లు వస్తాయి.

Advertisement
Anchor Suma Crushed His Son Roshan Live With A Broom! , Anchor Suma , Bubblegum

ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా యాంకర్ సుమ తన ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.ఈ వీడియో లో రోషన్ సినిమాలో హీరోయిన్ మానస చౌదరి తో కలిసి గోవాలో చేసిన లిప్ లాక్ సన్నివేశాలని చూస్తూ ఉంటాడు.

ఇది గమనించిన సుమ, రోషన్( Roshan kanakala ) ని చీపురు కట్టతో కొట్టడానికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది.

Anchor Suma Crushed His Son Roshan Live With A Broom , Anchor Suma , Bubblegum

ఇది ఇంస్టాగ్రామ్ రీల్ గా అప్లోడ్ చెయ్యగా, దానికి నిమిషాల వ్యవధిలోనే వేల కొద్దీ లైక్స్ మరియు కామెంట్స్ వచ్చాయి.ఇంస్టాగ్రామ్ రీల్ అంటే ఏంటో తెలియని వాళ్ళు, ఈ వీడియో ని సడన్ గా చూసి సుమ తన కొడుకుని నిజంగానే కొట్టింది అనుకుంటారు కానీ, అది కేవలం సరదాగా తీసిన వీడియో.ఇకపోతే బబుల్ గమ్ సినిమాకి మొదటి రెండు రోజులకు కలిపి దాదాపుగా కోటి రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఫుల్ రన్ తో ఎంత వసూలు చేస్తుందో చూడాలి.

కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?
Advertisement

తాజా వార్తలు